Begin typing your search above and press return to search.
వైసీపీ నెంబర్ 2... లోకేష్ బాడీ షేమింగ్ కరెక్ట్ కాదేమో!
By: Tupaki Desk | 13 Jun 2022 6:55 AM GMTరాజకీయాలలో ప్రత్యర్థి పార్టీలపై నాయకులు విమర్శలు చేయడం కొత్త కాదు. కౌంటర్లు ఇవ్వడం.. విమర్శ లు చేయడం.. ఎదుటి వారి వ్యూహానికి ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోవడం.. వంటివి కామన్‌గా జరిగేవే. అయి తే.. ఈ విమర్శలు, కౌంటర్లు... ఇప్పుడు హద్దులు మీరుతున్నాయి.
ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల వ్యక్తి గత విషయాలపైనా.. విమర్శలు చేస్తున్నవారు పెరుగుతున్నారు. ఇది రాజకీయంగా అప్పటికప్పుడు.. బాగు న్నా.. తర్వాత కాలంలో సదరు నాయకులకే ఇబ్బంది ఏర్పడుతుందని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయకులు తరచుగా విమర్శలు చేస్తుంటా రు. మరీ ముఖ్యంగా వైసీపీ కీలకనాయకుడు, నెంబర్ 2 విజయసాయిరెడ్డి.. లోకేష్ కేంద్రంగా విమర్శలు చేయడం.. కౌంటర్లు ఇవ్వడం .. వంటివి తరచుగా జరుగుతున్నవే.
అయితే.. వీటికి ఇటీవల కాలంలో హద్దు లేకుండా పోతోందనే వాదన వినిపిస్తోంది. లోకేష్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం.. ఆయన బాడీ షేమింగ్‌ను తప్పుబట్టడం.. వంటివి నిజానికి రాజకీయంగా సరికాదని సొంత పార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ''అంతా అనుకుంటున్నట్టు చిట్టి నాయుడు డైటింగ్ వల్ల చిక్కలే దు. భవిష్యత్తు శూన్యమనే బెంగతో ముద్ద మింగుడడు పడక అలా అవుతున్నాడు. చక్రాలు తిప్పాడనుకున్న తండ్రి కూర్చుని లేవలేకపోతుంటే, తన గతి ఏమిటని కుమిలిపోతున్నాడు. జూమ్ సెట్టింగ్ అంతా తీసేయించినా కలవరింతలు పోవడం లేదు'' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అయితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత విషయాలు.. మానసికంగా ఇబ్బంది పెట్టే విషయాలను కెలకడం వల్ల.. అంతిమంగా సాధించేది ఏంటి? అనేది ప్రశ్న. ఇది రాజకీయ దుమారానికి, వివాదానికి దారి తీస్తుందే తప్ప.. మరి దేనికీ కాదని అంటున్నారు పరిశీలకులు. నిర్మాణాత్మ క మైన విమర్శలు.. ప్రతివిమర్శలు, కౌంటర్లు.. ప్రజాస్వామ్య యుత రాజకీయలకు అవసరమని పేర్కొంటున్నారు. మరి సాయిరెడ్డి ఏమంటారో చూడాలి.