Begin typing your search above and press return to search.
లోకేష్.. కంటెంట్ రైటర్‌ను మార్చు అర్జంటుగా!
By: Tupaki Desk | 31 March 2022 10:46 AM GMTటీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్.. మాస్ లుక్ కోసం.. మాస్ ఇమేజ్ కోసం.. ఎంతో ప్రయాస పడుతున్నాడట. కొన్నాళ్లుగా ఆయన ఆహార్యం.. వ్యవహారం గమనిస్తే.. ఆయనలో కొట్టొచ్చినట్టు మార్పు కనిపిస్తోంది. గడ్డం గీయడం లేదు.. పెద్ద హై ప్రొఫైల్ డ్రస్‌లు కూడా వాడడం లేదు. కేవలం సాదాసీదాగా నే ఉంటున్నారు. పైగా.. లుక్ కూడా భిన్నంగా కనిపించేలా చేసుకున్నాడు. ఇవన్నీ. కూడా మాస్ కోసం.. పడుతున్న ప్రయాసేనని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి టీడీపీలో అన్న ఎన్టీఆర్ తర్వాత.. మాస్ లను ఆకర్షించిననాయకుడు మరొకరు లేరు. చివరకు ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. ఆయన ఎంత మాట్లాడాలని అనుకున్నా.. సాధ్యం కావడం లేదు. ఎందుకంటే.. చంద్రబాబు మాస్ నేత కాదు. ఆయన క్లాస్. విజనరీ నాయకుడు.. పైగా.. వర్క్ ఎడ్మినిస్ట్రేటర్‌గా పేరు పడ్డారు. అందుకే.. ఆయనను సీఈవోగా పిలుచుకున్న సందర్భాలు ఉన్నాయి.
నిజానికి రాజకీయంగా కురువృద్ధుడిగా పేరు తెచ్చుకున్న 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు వల్లే.. మాస్ ఇమేజ్ సంపాయించుకోవడం ఇబ్బందిగా మారింది. ఆయనకు మాస్ డైలాగులు రావడం లేదు. మరి ఆయన కుమారుడిగా లోకేష్ ప్రయత్నాలు ఎందుకు? అసలు ఆయనకు ఏం వచ్చని.. అంటున్నా రు పరిశీలకులు. ఇటీవల.. జగన్‌పై తీవ్రస్థాయిలో లోకేష్‌విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
ఇవన్నీ కూడా మాస్ ఇమేజ్ కోసమే! ఇక, ఇటీవల పార్టీ 40వ వార్షికోత్సవంలో లోకేష్ రెచ్చిపోయి మరీ మాట్లాడాడని అంటున్నారు. దివంగత ఎన్టీఆర్‌ను దేవు'డు' అని.. చంద్రబాబు నాయుడును.. రాము'డు' అని తనను తాను మూర్ఖు'డు' అని.. కొత్తగా 'డి' పద ప్రయోగం చేశాడు. మరి దానిలో ఏం లాజిక్ ఉందో ఆయనకే తెలియాలని అంటున్నారు. వాస్తవానికి ఇంత వరకు లోకేష్ ఎమ్మెల్యేగానే విజయం సాధించలేదు. తొలిసారి పోటీ చేసిన చోటే.. ఓడిపోయారు. అందునా.. రాజధాని ప్రాంతంలోనే ఆయన ఓటమి తీవ్రంగా పార్టీపై ప్రభావం చూపింది.
గత చంద్రబాబు పాలనలో ఎమ్మెల్సీగా ఉంటూ.. మంత్రి పదవి చేపట్టారు లోకేష్. అయితే.. తన పిల్ల చేష్టలతో .. పార్టీని నడిపించలేక.. టీడీపీలోని కురువృద్ధులను అవమానించారనే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆ రోజు నాయకులు.. లోకేష్‌కు గర్వం ఎక్కువ, అందుకే.. మంగళగిరిలో ఓడగొట్టారు కదా.. అని పెద్ద ఎత్తున విమర్శించారు. అంతేకాదు.. టీడీపీ పెద్దలు.. కూడా లోకేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా లోకేష్ మరో మాట కూడా అన్నారు. 12 కేసులు ఉంటేనే టీడీపీ కార్యకర్త అని! దీంతో ఇదేం లాజిక్కో అర్ధం కాక.. మేధావులు కూడా తలపట్టుకున్నారు. అన్ని కేసులు లేకపోతే.. కార్యకర్తలు కాదా? అని ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇప్పుడు టీడీపీలో 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నార ని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిన లాజిక్ ప్రకారం.. ప్రతి ఒక్కరిపై 12 కేసులు ఉంటే.. 84 కోట్ల కేసులు ఉండాలన్న మాట. మరి ఇదే తెలివో.. లోకేషే చెప్పాలని పరిశీలకులు అంటున్నారు.
ఇక్కడే మరో కీలక చర్చ జరుగుతోంది. లోకేష్ మాట్లాడుతూ.. నేను మూర్ఖుడిని.. వైసీపీ నాయకులు ఎక్క డున్నా..(టీపీపీ నేతలపై కేసులు పెట్టినవారు) వెతికి వెతికి కసి తీర్చుకుంటామన్నారు. మరి ఈ క్రమంలో మూర్ఖుడిని అని ఎందుకు చెప్పుకొన్నాడో ఆయనకే తెలియాలి. కానీ, ఇప్పుడు ఈ వాదన వైసీపీకి అంది వచ్చిన వరంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు..పప్పు అంటూ.. లోకేష్‌ను ప్రచారం చేశారు. ఇక, ఇప్పుడు.. మూర్ఖుడు అని ప్రచారం చేసే అవకాశం లోకేష్ స్వయంగా ఇచ్చారని.. పరిశీలకులు చెబుతున్నారు.
రేపు ఎన్నికల సమయంలో.. "టీడీపీని గెలిపిస్తే.. మూర్ఖుడినని గెలిపించినట్టే.. అవుతుంది!" అని వైసీపీ వారు ఊరు, వాడా అంతా చాటింపు వేస్తే.. నీ పరిస్థితి ఏంటి లోకేష్ సార్! అని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కరెక్ట్‌గానే పాలిటిక్స్‌ను నడిపిస్తున్న పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో ఆయనను ఫాలోఅయితే.. బెటర్ అని.. మాస్ డైలాగులతో మాట్లాడితే.. యూత్‌ని ఆకట్టుకోవాలని చూస్తే.. మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం కంటెంట్ రైటర్‌ని మార్చు లోకేష్ బాబూ.. అంటున్నారు.