Begin typing your search above and press return to search.
టీడీపీకి షాకిచ్చిన లోకేష్ సన్నిహితుడు
By: Tupaki Desk | 6 Jan 2020 4:43 AM GMTసైకిల్ పార్ట్స్ ఊడిపోతున్నాయి.. ఒక్కొక్కరూ దిగిపోతున్నారు. ఏపీలో ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకం సడలుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు యువనేత దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా టీడీపీ కి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తన పదవికి రాజీనామా చేసి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాసి సంచలన విషయాలను ప్రస్తావించి తప్పుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు.. రాజీనామా చేసిన బ్రహ్మం చౌదరి చాలా సన్నిహితుడని పేరుంది. లోకేష్, టీడీపీ తరుఫున మొన్నటి ఎన్నికల వేళ బ్రహ్మం చౌదరి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. యువత ఓట్లను టీడీపీకి మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయన ఆ వర్గం యువతను ఆకట్టుకున్నారు.
బ్రహ్మం చౌదరి లేఖలో చంద్రబాబు వల్లే ఎదిగానని.. అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం బాధ కలిగిస్తోందని.. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవాల్సి వస్తోందని అన్నారు.
అయితే తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి కి మంచి సంబంధాలున్నాయి. ఆయన ప్రోద్బలంతో పార్టీ మారినట్లు తెలుస్తోంది. లోకేష్ సన్నిహితుడే ఇలా పార్టీ మారడం సంచలనంగా మారింది.