Begin typing your search above and press return to search.

టీడీపీ స‌భ్యుల‌కు మ‌రోమారు ప‌ద‌వుల పందేరం?

By:  Tupaki Desk   |   20 July 2015 8:31 AM GMT
టీడీపీ స‌భ్యుల‌కు మ‌రోమారు ప‌ద‌వుల పందేరం?
X
తెలుగుదేశం పార్టీ మ‌రోమారు త‌న పార్టీ స‌భ్యుల స‌మ‌స్త స‌మాచారాన్ని సేక‌రిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు, తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కోసం ప‌నిచేసిన నాయ‌కులు ఎవ‌రు? కార్య‌క‌ర్త‌లు ఏవిధంగా ముందుకువెళ్లారు.? వారు ఎంత కాలం నుంచి పార్టీలో ఉన్నారు.? పార్టీ కోసం వారు ఏమైనా ఖ‌ర్చు పెట్టారా? ఇప్ప‌టివ‌ర‌కు వారు పార్టీ నుంచి ఏమైనా ల‌బ్దిపొందారా? వారి ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? అనే వివ‌రాల‌ను పార్టీ సేక‌రిస్తోంది. ఈ మేర‌కు రెండు రాష్ర్టాల‌లోని 55 ల‌క్ష‌ల‌మంది స‌భ్యుల పూర్తి వివ‌రాల‌ను రెడీ చేసుకునేందుకు క‌స‌ర‌త్తు మొద‌లైన‌ట్లు స‌మాచారం.

నాలుగు నెల‌ల్లో స‌భ్యుల వివ‌రాల‌ను సేక‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. కంప్యూట‌రీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను 18 నెల‌ల్లో పూర్తి చేయాల‌ని టీడీపీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. య‌థావిధిగా ఈ కార్య‌క్ర‌మం టీడీపీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్ లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే సాగుతోంది. ప్ర‌భుత్వ‌ప‌రంగా ప‌ద‌వులు, పార్టీ నుంచి ఏదైనా స‌హాయం పొందేందుకు ఈ స‌మాచారాన్నిప్రాతిప‌దిక‌గా చేసుకోవాల‌ని భావిస్తున్నారు.

ఇదే క్ర‌మంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించి అవినీతి స‌మాచారం కూడా సేక‌రించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వారు ఏమైనా అవినీతి చేశారా? గ‌తంలో ఏదైనా ప‌ద‌వులు అనుభ‌వించి ఉంటే ఆ క్ర‌మంలో వారిపై స‌ద‌రు విమ‌ర్శ‌లు ఏమైనా వ‌చ్చాయా అనే కోణంలో సైతం పార్టీ త‌ర‌ఫున డాటా క‌లెక్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

మొత్తంగా పార్టీ ప‌ద‌వులు, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికి పెద్దపీట వేయాల‌నే దిశ‌గా ఈ డాటా స‌సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని మొద‌లుపెట్టారు.