Begin typing your search above and press return to search.

హరీష్ , రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన లోకేష్ !

By:  Tupaki Desk   |   13 Jan 2020 8:33 AM GMT
హరీష్ , రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన లోకేష్ !
X
ఏపీకి మూడు రాజధానులు ఉండబోతున్నాయి అని సీఎం జగన్ ప్రకటించిన క్షణం నుండి ఏపీలో నిరసన జ్వాలలు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు దాదాపుగా గత నెలరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక వీరికి మద్దతిస్తూ టీడీపీ కూడా ప్రభుత్వం పై పోరాటానికి దిగింది. ఇక ఈ నేపధ్యం లో ఏపీ లో ఎక్కడ చూసినా ధర్నాలు, ర్యాలీలు. అరెస్ట్ లు , హౌస్ అరెస్ట్ లతో ఏపీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మూడు రాజధానులతో ప్రగతి సాధ్యం కాదని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఉంటాయని ఈ ప్రయోగం సత్పలితాలను ఇవ్వదని వారు చెప్తున్న పరిస్థితి . అలాగే ఈ సమస్య పై తెలంగాణ నేతలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం టీఆర్ ఎస్ కీలక నాయకుడు ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావ్ ఏపీ లో నెలకొన్న పరిస్థితులను చూసి ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఏపీలో రాజధాని రగడ నేపధ్యంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రాలో నెలకొన్న పరిస్థితుల మూలంగా ఒక తెలంగాణ బిడ్డగా తాను గర్వపడుతున్నాను అని అన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణాలోని పాలక, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యల పై ఏపీ లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు వీడియోలను కలిపి టీడీపీ నేత మాజీ మెంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఏపీ లో పరిస్థితి అర్ధం అయ్యేలా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ పరిపాలన పుణ్యమా అని, ఒకే తాటిపైకి వచ్చిన పక్క రాష్ట్రం, పాలక పక్షం, ప్రతిపక్షం. పిచ్చి తుగ్లక్ పాలన వలన మన రాష్ట్రం బీహార్ తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి మన కర్మ అని అనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదు అంటూ ట్వీట్ చేసి తన అసహనం వ్యక్తం చేశారు.