Begin typing your search above and press return to search.
రోజాపై లోకేష్ పంచ్ లు
By: Tupaki Desk | 10 Dec 2015 7:30 AM GMTటీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన రోజాకు ఇక్కడ కాలం కలిసి రాలేదు. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆమె రెండుసార్లు కూడా ఘోరంగా ఓడిపోయారు. తర్వాత పార్టీ మారి వైకాపాలో ఎంట్రీ ఇచ్చి గత ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు వంటి సీనియర్ లీడర్ ను ఓడించడంతో రోజా ప్రతిష్ట బాగానే పెరిగింది. ఇక ఎమ్మెల్యే అవ్వకముందే టీడీపీ అండ్ చంద్రబాబును పదే పదే టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించే రోజా ఎమ్మెల్యే అయ్యాక మరీ రెచ్చిపోతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు చాలాసార్లు వివాస్పదమైన సంగతి తెలిసిందే.
తాజాగా రోజా వైఖరిపై టీడీపీ యువనేత - చినబాబు లోకేష్ సెటైర్లు వేశాడు. జనచైతన్య యాత్రలో భాగంగా చిత్తూరులో పర్యటిస్తున్న లోకేష్..వైకాపా అధినేత వైఎస్.జగన్ తో పాటు ఎమ్మెల్యే రోజాను కూడా టార్గెట్ గా చేసుకున్నారు. రోజాకు నోటికి ఏం వస్తే..అది మాట్లాడుతుందే తప్ప... ఆమె తాను ప్రాథినిత్యం వహిస్తున్న నగరి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నలు సంధించారు. రోజా ఏదో చేస్తుందని ఓట్లేసి గెలిపించిన నగరి ప్రజల పరువును ఆమె తీసేశారని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ మీద లేనిపోని విమర్శలు చేస్తున్న రోజాకు తాము చేసే మంచి పనులు కనపడడం లేదా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక జగన్‌ను ఉద్దేశించి దొంగబ్బాయి టీడీపీ మీద అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని....జగన్ తండ్రి వైఎస్‌లాగా చంద్రబాబు ఎప్పుడూ సీమ ప్రజలను మోసం చేయరని లోకేష్ అన్నారు. టీడీపీ ఎన్నికల్లో 400 హామీలు ఇస్తే....ఇప్పటికే 200 హామీలు నెరవేర్చిందన్నారు. కేంద్రప్రభుత్వంతో టీడీపీ ఎప్పుడూ సఖ్యతగానే ఉంటుందని...కేంద్రంతో విబేధిస్తూ పోతే రాష్ర్టానికి స్పెషల్ స్టేటస్‌తో పాటు..ప్రత్యేక నిధులు కూడా రావని లోకేష్ చెప్పారు. అలాగే టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలగితే ఎన్డీయేలో చేరి జగన్ రెండు మంత్రి పదవులు కొట్టేయాలన్న కుత్రంత్రపు ఆలోచనలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.