Begin typing your search above and press return to search.
లోకేష్ భయం.. వైసీపీ లో టన్నుల కొద్దీ అట.!
By: Tupaki Desk | 11 Dec 2019 4:51 AM GMTజల్సా మూవీ లో పవన్ కళ్యాణ్ చెప్పిన పాపులర్ డైలాగ్ ‘భయం.. నీకు టన్నుల లెక్కన ఇస్తా’ విలన్ ను హెచ్చరిస్తూ చెపుతాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను ఆయన పార్ట్ నర్ గా వైసీపీ అభివర్ణిస్తున్న చంద్రబాబు కొడుకు లోకేష్ చేశాడు. ‘నేనంటే అధికార వైసీపీ వాళ్లకు ఎందుకంత భయం?’ అంటూ తొడకొట్టేశారు..
నిజానికి రీల్ లో కొట్టిన పవన్ కళ్యాణ్, రియల్ గా డైలాగ్ కొట్టిన లోకేష్ బాబులు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. వీరిద్దరూ ప్రజల మనసులు గెలవలేదు. వారి ఓట్లతో గెలవలేదు.అయినా పరుష డైలాగులతో ఓడించిన ప్రజల వద్దకే వెళ్లి గెలిపించిన వైసీపీ వాళ్ల గురించి మాట్లాడుతున్నారు.
తాజాగా అసెంబ్లీలో లోకేష్ టాపిక్ హాట్ టాపిక్ గా మారుతోంది. రోజా, మంత్రి అనిల్ సహా లోకేష్ బాబును పప్పూ అని వైసీపీ ఎమ్మెల్యేలు అంటుంటే లోకేష్ హర్ట్ అయినట్టున్నాడు. అందుకే బయటకొచ్చి ‘వైసీపీ వాళ్లు నా గురించి భయ పడుతున్నారు’ అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
నిజానికి వైసీపీ వాళ్లు భయపడడం లేదు. ఎద్దేవా చేస్తున్నారు. అవమానిస్తున్నారు. తెలుగులో భారీ పరిజ్ఞానం ఉన్న లోకేష్ బాబుకు ఇది ఇలా అర్థమైందా అని ఇప్పుడు వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. భయానికి , అవమానాలకు తేడా తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అయినా లోకేష్ బాబు తెలుగు పరిజ్ఞానం గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..!