Begin typing your search above and press return to search.
బాబే కాదు.. చినబాబు కూడా బుక్ అయ్యారా?
By: Tupaki Desk | 12 Jun 2015 6:33 AM GMTఓటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తున్నట్లుగా ఉంది. తాజా పరిణామాలు చూస్తే.. టీడీపీ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌ను ఫిక్స్ చేయటం మాత్రమే లక్ష్యం అని చెప్పుకున్నా.. ఈ అంశంపై లోతుగా దృష్టి సారిస్తున్న నిఘా వర్గాలు ఆశ్చర్యకరమైన అంశాల్ని బయటకు తెస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటివరకూ ఈ ఉదంతంలో రేవంత్‌తో పాటు.. మరో ఇద్దరు ఎంపీలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్రను తెలియజేస్తూ.. ఈ మధ్యనే బాబు మాట్లాడిన ఆడియో టేపు ఒకటి మీడియాలో ప్రత్యక్షం కావటం.. ఇదో పెనుసంచలనంగా మారటం తెలిసిందే.
తాజాగా.. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులకు మరింత సమాచారం చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. ఈ ఉదంతంలో చంద్రబాబుతో పాటు.. ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర కూడా ఉందన్న ఆధారాలు లభిస్తున్నట్లు సమాచారం. స్టీఫెన్‌సన్‌తో బేరసారాల సందర్భంలో చినబాబు కూడా కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలు కొన్ని లభించినప్పటికీ.. అవన్నీ చినబాబుకు సంబంధం ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసే దిశగా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. తమకు లభించిన ఆధారాలకు సంబంధించిన మరికొన్ని ఆధారాలు లభిస్తే.. ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ఇరుక్కుంటారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసే అనుబంధ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబుతో పాటు లోకేశ్.. మరికొందరు ఎంపీలు.. ఎమ్మెల్యేల పేర్లు కూడా జత చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే మరో రెండు.. మూడు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.