Begin typing your search above and press return to search.

లోకేష్ పాద‌యాత్ర‌.. టీడీపీలో క‌ద‌నోత్సాహం..!

By:  Tupaki Desk   |   19 Sep 2022 7:04 AM GMT
లోకేష్ పాద‌యాత్ర‌.. టీడీపీలో క‌ద‌నోత్సాహం..!
X
పాద‌యాత్ర‌కు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య ఇప్పుడు అవినాభావ సంబంధం ఏర్ప‌డింది. గతంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. పాద‌యాత్ర చేశారు. దీంతో ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు. ఈ ఎఫెక్ట్‌.. రెండు సార్లు.. కాంగ్రెస్‌కు అధికారం అప్ప‌గించింది. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ టీడీపీ దీనిని లైట్‌తీసుకున్నా.. 2014కు ముందు.. మాత్రం వ‌స్తున్నామీకోసం.. అంటూ.. చంద్ర‌బాబు కూడా పాద‌యాత్ర చేశారు.

ఇది కూడా ఫలించింది. దీంతో ఆయ‌న నవ్యాంధ్ర‌కు తొలి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల కు ముందు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. ఇది కూడా ఫలించి.. ఆయ‌న కూడా అధికారంలో కి వ‌చ్చారు. అంతేకాదు..

చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగ‌ని స్థానాల‌ను ఆయ‌న కైవ‌సం చేసుకున్నారు. ఇక‌, క‌ట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్ కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. దాదాపు 450 రోజుల పాటు.. నిర్విరామంగా ఆయ‌న పాద‌యాత్ర చేయ‌నున్నారు.

ఈ ఏడాది మ‌హానాడు స‌మ‌యంలోనే దీనిపై క్లూ ఇచ్చారు. అయితే.. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌నల త‌ర్వాత ఇప్పుడు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను క‌లుపుతూ.. లోకేష్ పాద‌యాత్ర చేయ‌నున్నార‌ని..పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఏకంగా.. 450 రోజుల పాటు.. ఆయ‌న పాద‌యాత్ర సాగ‌నుంద‌ని..ఎక్క‌డా విరామం కూడా తీసుకోకుండా.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటార‌ని.. పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే.. లోకేష్ పాద‌యాత్ర పార్టీకి ఏమేర‌కు స‌క్సెస్ అందిస్తుంద‌నేది ప్ర‌శ్న‌.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌.. పాద‌యాత్ర‌లు ప‌రిశీలిస్తే.. అవ‌న్నీ స‌క్సెస్‌గా సాగాయి. పాద‌యాత్ర చేసిన నాయకులు అధికారంలోకికూడా వ‌చ్చారు. దీనిని బ‌ట్టి లోకేష్ హ‌వా కూడా పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అంటున్నారు. అయితే.. పార్టీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న నైరాశ్యం తొల‌గించే ప్ర‌య‌త్నం కూడా చేయాల‌నేది కొంద‌రి సూచ‌న‌.

ఇప్ప‌టికీ చాలా మంది నాయ‌కులు.. పార్టీలో యాక్టివ్‌గా లేర‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ముందు దీనిపై దృష్టి పెట్టి.. త‌ర్వాత‌.. పాద‌యాత్ర వంటి కీల‌క అంశాన్ని ఎంచుకుంటే.. బెట‌ర్ అని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. అయితే.. పాద‌యాత్ర మాత్రం జోష్‌నింప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.