Begin typing your search above and press return to search.

ఇటు పాద‌యాత్ర‌.. అటు బ‌స్సు యాత్ర‌.. ఇక‌, జ‌గ‌నే తేల్చుకోవాలిగా...!

By:  Tupaki Desk   |   13 Dec 2022 1:30 AM GMT
ఇటు పాద‌యాత్ర‌.. అటు బ‌స్సు యాత్ర‌.. ఇక‌, జ‌గ‌నే తేల్చుకోవాలిగా...!
X
రాష్ట్రంలో ఒకే సారి రెండు యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. పాద‌యాత్ర కు రెడీ అవుతున్నారు. జ‌న‌వ‌రి 27ను ఆయ‌న ముహూర్తంగా నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా జ‌న‌వ‌రి లో సంక్రాంతి త‌ర్వాత‌.. ఆయ‌న కూడా బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. జిల్లాల వారీగా బ‌లం ఉన్న చోట గెలుస్తామ‌ని అనుకున్న చోట‌.. ఏడాది పాటు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ యాత్ర‌లు చేయ‌నున్నారు.

దీంతో వ‌చ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయం వేడెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ప్ర‌తిప‌క్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన ఇంత దూకుడు చూపిస్తే.. జ‌గ‌న్ మాత్రం ఊరుకుంటారా? ఆయ‌న కూడా దూకుడుగానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే గృహ సార‌థులను నియ‌మించిన ఆయ‌న.. త్వ‌ర‌లోనే వీరిని కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య తిప్ప‌నున్నారు. అయితే.. ఇక్క‌డితో వ్యూహం అయిపోలేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకురెడీ అవుతున్నారు.

గ‌తంలో వైఎస్ చేసిన ర‌చ్చ‌బండ త‌ర‌హా లాంటి కార్య‌క్ర‌మ‌మే అయిన‌ప్ప‌టికీ.. దీనికి మ‌రింత సొబ‌గులు అద్ది.. దూకుడుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు రంగంలోకి దిగుతున్నారు. దీంతో వైసీపీ త‌ర‌ఫున కూడా మ‌రింత రాజ‌కీయ వేడి రాజుకోనుంది. అదేవిధంగా చంద్ర‌బాబు కూడా జిల్లాల ప‌ర్య‌ట‌ల‌ను మ‌రింత పెంచ‌నున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న దీనిని రెండు మాసాల‌కే ప‌రిమితం చేసుకున్నా.. జిల్లాల్లో వ‌స్తున్న స్పంద‌న చూసిన త‌ర్వాత‌.. దీనిని మ‌రికొన్నిజిల్లాల‌కుపొడిగించుకుంటూ.. ఎన్నిక ల స‌మ‌యానికి పూర్తిస్థాయిలో ఒక రౌండ్ రాష్ట్రాన్ని చుట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, కాంగ్రెస్ కూడా.. త్వ‌ర‌లోనే గ్రామీణ స్థాయిలో తిరిగి ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు పాద‌యాత్ర‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. పీసీసీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు స్వ‌యంగా పాద‌యాత్ర‌లు ప్రారంభించి.. అంద‌రినీ క‌ల‌పుకొని పోవ‌డంతో పాటు ఘ‌ర్ వాప‌సీ వ్యూహాన్ని అనుస‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత‌.. రాష్ట్రంలో రాజ‌కీయ సంక్రాంతి ప్రారంభిస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.