Begin typing your search above and press return to search.

లోకేష్ పాద‌యాత్ర.. జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్..!

By:  Tupaki Desk   |   20 Sep 2022 8:44 AM GMT
లోకేష్ పాద‌యాత్ర.. జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్..!
X
టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. వ‌చ్చే సంక్రాంతికి కొంచెం ముందు లేదా.. వెనుక ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టించాల‌ని.. భావిస్తున్నారు.దీనికి సంబంధించిన అన‌ధికార సంకేతాలు.. సందేశాలు.. ఇప్ప‌టికే జిల్లాల‌కు వెళ్లిపోయాయి.

ముఖ్యంగా లోకేష్ పాద‌యాత్ర‌ను స‌క్సెస్ చేసే బాధ్య‌త‌ను పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మించిన వారికి అప్ప‌గిస్తు న్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. లోకేష్ పాద‌యాత్ర సంద‌ర్భంగా జిల్లాల్లో అంత‌ర్గ‌తంగా నాయ‌కులు.. రెడ్ అలెర్ట్ జారీ చేశార‌ని అంటున్నారు.

లోకేష్ పాద‌యాత్ర దాదాపు 450 రోజులు సాగ‌నుంది. అంటే.. 2024 మార్చి వ‌ర‌కు ఈ పాద‌యాత్ర కొన‌సాగ నుంది. ఈ పాద‌యాత్ర అన్ని జిల్లాలు.. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు క‌వ‌ర్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

ఈ క్ర‌మంలో రెండు కీల‌క ల‌క్ష్యాలు పెట్టుకుని.. లోకేష్ అడుగులు వేస్తున్నార‌నే ది పార్టీ సీనియ‌ర్ల మాట‌. ప్ర‌ధానంగా .. వైసీపీ స‌ర్కారు విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయ‌డం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవ‌డం.

రెండు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డం.. నేత‌ల తీరు.. ప్ర‌త్య‌ర్థుల‌తో వారికి ఉన్న సంబంధాలు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు నాయ‌కుల విష‌యంలో ఏమ‌నుకుంటున్నారు.. అస‌లు టీడీపీ నేత‌ల గ్రాఫ్ ఎలా ఉంది? ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి.. ఎవ‌రిని ప‌క్క‌న పెట్టాలి? అనే పార్టీ ప‌ర‌మైన ముఖ్య‌మైన అంశాల‌ను కూడా లోకేష్ ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. ఎందుకంటే.. 2024 మార్చి చివ‌రి నాటికి ఈ పాద‌యాత్ర ముగుస్తుంది.

అనంత‌రం.. లేదా.. అప్ప‌టికే ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చి ఉంటే.. దాని ప్ర‌కారం.. టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అప్పుడు వ్య‌వ‌హారం అంతాకూడా.. లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే సాగ‌నుంద‌నేది.. పార్టీ సీనియ‌ర్ల అభిప్రాయం. మ‌రీ ముఖ్యంగా.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న నేప‌థ్యంలో యువత ఏమేర‌కు పుంజుకుంటున్నార‌నే విష‌యాల‌ను కూడా ఈ పాద‌యాత్ర‌లో లోకేష్ స్ప‌ష్టంగా తెలుసుకుంటార‌ని.. చెబుతున్నారు. దీంతో జిల్లాల్లో నాయ‌కులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న వారు.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీనియ‌ర్లు స‌మాచారం చేర‌వేసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.