Begin typing your search above and press return to search.

లోకేష్ పాద‌యాత్ర‌.. సీనియ‌ర్ల లాభాల వేట‌!

By:  Tupaki Desk   |   11 Dec 2022 2:30 PM GMT
లోకేష్ పాద‌యాత్ర‌.. సీనియ‌ర్ల లాభాల వేట‌!
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై టీడీపీ నాయ‌కుల మ‌ధ్యే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు.. వైసీపీ ఘోర ఓట‌మి ల‌క్ష్యంగా పాద‌యాత్ర‌ను ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు నారా లోకేష్. దీనికి ముహూర్తం కూడా ఖ‌రారైంది. 4000 కిలో మీట‌ర్లు, 400 రోజులు అనే కాన్సెప్టుతో ఈ పాద‌యాత్ర సాగ‌నుంది.

అయితే.. పాద‌యాత్ర‌పై పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు, మేధావులుగా లాభాల వేట‌లో ప‌డ్డారు. తమ త‌మ నియోజ‌వ‌క‌ర్గాల ద్వారా పాద‌యాత్ర సాగాల‌ని వారు కోరుతున్నారు. నిజానికి రూట్ మ్యాప్ ఇంకా ప్రిపేర్ కాలేద‌ని టాక్‌. ఏయే ప్రాంతాల గుండా ముందుకు సాగాల‌నే విష‌యంపై సీనియ‌ర్ల‌తో నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. చివ‌ర‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఫైనల్ చేసుకుని.. ముందుకు సాగే అవ‌కాశం ఉంది.

జ‌న‌వ‌రి 27 వ‌ర‌కు స‌మ‌యం ఉన్నందున‌.. మ‌రో 15 రోజుల్లో రూట్ మ్యాప్ రెడీ అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్ నాయ‌కులు.. త‌మ నియోజ‌క‌వ‌ర్గం మీదుగా ఉండాల‌ని.. అంటే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గం మీదుగా ఉండాలంటూ.. ప్రాధేయ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. లోకేష్ పాద‌యా త్రకు సంబంధించి ప్ర‌జ‌ల నుంచి భారీ స‌పోర్టు ద‌క్కుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అదేస‌మ‌యంలో టీడీపీ అనుకూల ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని కూడా లెక్క‌లు బాగానే వేసుకుంటు న్నారు. పాద‌యాత్ర‌లు ప్ర‌భుత్వాల‌ను మార్చిన హిస్ట‌రీని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో నారా లోకేష్ పాద‌యాత్ర కూడా అదే రికార్డును సొంతం చేసుకుంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అందుకే.. నాయ‌కులు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో కావాలంటే.. త‌మ ప్రాంతంలో కావాలంటూ.. పార్టీ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. త‌ద్వారా వారి గెలుపును ముందే రాసిపెట్టుకోవ‌చ్చ‌న్న ధీమాలో ఉన్న‌ట్టు చ‌ర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.