Begin typing your search above and press return to search.

లోకేష్ ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవ్వు!: చంద్రబాబు

By:  Tupaki Desk   |   10 Feb 2021 2:30 PM GMT
లోకేష్ ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవ్వు!: చంద్రబాబు
X
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఏపీలో కేవలం 23 సీట్లకే పరిమితమైంది. చంద్రబాబు రాజకీయంగా ఇంతటి ఘోర పరాజయం తర్వాత జగన్ ధాటికి విలవిలలాడుతున్నాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన చంద్రబాబు.. ఓటమి తర్వాత బీజేపీ వాళ్ల వెంటపడుతున్నాడు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన మోసంతో బీజేపీ వాళ్లు ఇప్పుడు దగ్గరకు రానీయడం లేదు. దీంతో మానసికంగా చంద్రబాబు కుంగిపోతున్నాడ..

ఈలోపు జగన్ పరిపాలనతో ఏపీలో ప్రజలకు చేరువ అవుతున్నాడు. వారిపై సంక్షేమ పథకాల జల్లు కురిపిస్తున్నాడు. మీడియా అంతా టీడీపీ సైడ్ ఉన్నా ఏపీలో ఉన్న బలమైన నాయకులు అంతా అధికార వైసీపీ వైపు చూస్తుండడం.. ఆ పార్టీలో చేరుతుండడం.. టీడీపీని వదిలిపోతుండడంతో రాజకీయంగా చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయట.. పవర్ పాలిటిక్స్ ధాటికి చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట..

ఏదో ఒకరోజు చాన్స్ వస్తుందని.. క్యాడర్ ను పోగొట్టుకోకుండా రోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని పార్టీ కేడర్ తో టచ్ లో ఉన్నాడు. అయితే కుమారుడు లోకేష్ ఎన్నికల ముందు ఉబకాయంతో బొద్దుగా ఉన్నాడు. లోకేష్ ను ఈ మధ్య స్లిమ్ ఫిట్ మాదిరి తయారు చేసి హెల్త్ పరంగా మంచిగా తయారయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎవరిని అడిగినా చెప్తారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి పార్లమెంట్లో చట్టం తెచ్చింది.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మంచి అవకాశం వచ్చిందని లోకేష్ ను త్వరలో హంగర్ స్ట్రైక్ చేయాల్సి వస్తుందని చెప్పాడంట.. అందుకు లోకేష్ కూడా ఓకే అని చెప్పాడంట.. కేడర్ పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్న అందరినీ చర్చించిందని తరువాత అతి త్వరలో బీజేపీనుంచి పూర్తి స్థాయిలో ప్రైవేటు పరం చేస్తే లోకేష్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. కేడర్ ను బలోపేతం చేసే కార్యక్రమం తీసుకొని రావాలని అప్పుడు లోకేష్ మీద కేడర్ కు నమ్మకం వస్తుందని పార్టీ భావిస్తోంది. తద్వారా పార్టీకి కూడా ఉపయోగం అని కూడా టీడీపీ పెద్దలు అనుకుంటున్నారట..