Begin typing your search above and press return to search.

మంట పుట్టే వీడియో పెట్టి.. సెగలు కక్కే ట్వీట్లతో లోకేశ్ ఫైర్

By:  Tupaki Desk   |   20 Oct 2021 6:30 AM GMT
మంట పుట్టే వీడియో పెట్టి.. సెగలు కక్కే ట్వీట్లతో లోకేశ్ ఫైర్
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఏపీ రాజకీయం వేడెక్కింది. రాజకీయాల్లో కామన్ అయిన విమర్శలు.. ప్రతి విమర్శలు అంతకంతకూ ఎక్కువైపోతున్న వేళ.. టీడీపీ నేత పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్.. అందులో ఆయన వాడిన భాష.. చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అనూహ్యంగా టీడీపీ నేతలు.. టీడీపీ కార్యాలయం మీద దాడులకు పాల్పడిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పట్టాభి వాడిన భాష అభ్యంతరకరంగా ఉందనే అనుకుందాం. అలా అని అభ్యంతరంగా మాట్లాడిన వారి ఇంటి మీదకు వెళ్లి దాడి చేయటం.. ఆఫీసుల్ని ధ్వంసం చేయటమే పరిష్కారమా? అదే నిజమైతే.. కోర్టులు.. పోలీసులు లాంటి వ్యవస్థలు ఎందుకు?

అయితే.. దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నాయి వైసీపీ వర్గాలు. ఎవరెన్ని చెప్పినా.. దాడులు చేయటం ముమ్మాటికి తప్పే. అధికారంలో ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా బలప్రదర్శనతో సాధించేదేమిటి? ఇలాంటి దాడులకు పాల్పడిన వైనంతో.. ఏపీ ఇమేజ్ ఏమవుతుందన్నది ప్రశ్న. ఇటీవల కాలంలో ఎక్కువైన దూకుడు రాజకీయాల్లో సంస్కారాన్ని వదిలేసి.. గౌరవ మర్యాల్ని పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఎక్కువైంది. అంత మాత్రానికే ఇలా దాడుల చేయటమా? అది కూడా.. ఒక్క నేత.. ఒక పార్టీ ఆఫీసు కాకుండా.. రాష్ట్రంలోని పలు చోట్ల ఒకే సమయంలో ఒకే తరహాలో దాడులు జరటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఇదిలా ఉంటే..తమపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన లోకేశ్.. ఘాటైన ట్వీట్లు చేశారు. తన ట్వీట్లకు బలం చేకూరేలా పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడుల వీడియోల్ని జత చేశారు. వీటిని చూసిన వారు ఎవరైనా.. ఇంతలా దాడులు చేయటమా? అని షాక్ కావాల్సిందే. సినిమా సీన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగిన ధ్వంస రచన అధికార పక్షానికి నష్టం చేసేదే.

తాజాగా తమ మీద జరిగిన దాడికి బదులుగా ట్విటర్ లో స్పందించిన లోకేశ్.. తన వరకు తాను సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా? అనటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు తోపు రౌడీవి అయితే నేను నీకన్నా పెద్ద తోపు రౌడీని అని చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాయకులు ప్రజల్ని పాలించటానికి.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఉండాలే తప్పించి.. యాక్షన్ సినిమాల్లోచూపించే సీన్ల కోసం కాదు.

లోకేశ్ ట్వీట్లు కాసింత హద్దులు దాటేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే.. ఒక మాట అన్నప్పుడు దానికి ఆధారం కానీ.. సాక్ష్యం కాని చూపించాలి. మొదటి ట్వీట్ లో ‘నువ్వూ.. నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతారు’ అన్న వ్యాఖ్యనే తీసుకుంటే.. ముఖ్యమంత్రిపై అంత తీవ్రమైన నింద వేసే వేళలో.. దానికి సాక్ష్యం చూపించాలి కదా? అలా కాకుండా చేతికి వచ్చినట్లుగా ట్వీట్లు చేయటంలో అర్థం లేదు.

టీడీపీ ఆఫీసులపైనా.. నేతలపైనా అంత దారుణంగా దాడులు జరిగినప్పుడు కూడా.. చేతకానివాడిలా చేతులు కట్టుకొని.. నీతికబుర్లు చెప్పాలా? ఆ మాత్రం మసాలా అవసరం లేదా? అని ఆవేశంతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం అనవసరం. ఎందుకంటే.. ఎవరికి వారు వారికి సరిపోయే మసాలా కలిపేస్తూ పోతే.. రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ ట్వీట్లు.. చదవినంతనే ఆవేశానికి గురయ్యేలా.. మావోడు ఇరగదీశాడుగా.. మాటలతో తాట తీశాడుగా అనే మాటలకు బదులు.. లాజిక్ గా.. ఆలోచించేలా.. సరైన ప్రత్యామ్నాయం ఇతడేనేమో అనేలా ఉంటే బాగుంటుందని చెప్పక తప్పదు.
లోకేశ్ ట్వీట్లు ఇవే..

- ‘‘ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ అనేవాడిని. నీ వికృత‌, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ @ysjagan అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్ర‌గ్స్ బిజినెస్ చేస్తారు. నిల‌దీసే టిడిపి నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌తావా?’’

- ‘‘ప‌రిపాలించ‌మ‌ని ప్ర‌జ‌లు అధికారం అందిస్తే... పోలీసుల అండ‌తో మాఫియా సామ్రాజ్యం న‌డుపుతావా? టిడిపి కేంద్ర‌కార్యాల‌యాల‌పై గూండా మూక‌ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ‌తావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం’’

- ‘‘తెలుగుదేశం స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా? నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్ట‌డానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రంలేదు. నీ అరాచ‌కాల‌పై ఆగ్ర‌హంగా వున్న కేడ‌ర్‌కి మా లీడ‌ర్ క‌నుసైగ చేస్తే చాలు’’

- ‘‘నీ కార్యాల‌యాల విధ్వంసం నిమిషం ప‌ని. నీ ఫ్యాన్ రెక్క‌లు మ‌డిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంత‌వ‌ర‌కూ త‌రిమి కొడ‌తారు మా కార్య‌క‌ర్త‌లు. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసి..నీ స‌మాధికి నువ్వే గొయ్యి త‌వ్వుకుంటున్నావు కోడికత్తిగా’’