Begin typing your search above and press return to search.
అచ్చెన్న - లోకేష్ మధ్య దూరం పెరిగిందా..?
By: Tupaki Desk | 24 Jun 2021 3:31 AM GMTఔను! టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు మధ్య దూరం పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కావలంలో అచ్చెన్నతో లోకేష్ మాట్లాడడం లేదని.. అచ్చెన్న కూడా మౌనంగానే ఉన్నారని పార్టీ సీనియర్ల మధ్య గుసగుస కొనసాగుతోంది. తిరుపతి పార్లమెంటు ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు చేసినట్టుగా కొన్ని వ్యాఖ్యలు హల్‌చల్ చేశాయి. అయితే.. ఆ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు అటు చంద్రబాబు.. ఇటు పార్టీ సీనియర్లు ఎవరూకూడా అచ్చెన్నను వివరణ కోరలేదు. అచ్చెన్న కూడా ఆ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీనికితోడు.. లోకేష్‌ను సమర్థిస్తూ అనంతరం అచ్చెన్న ఎక్కడా ప్రసంగించనూ లేదు.
దీంతో లోకేష్.. అప్పటి నుంచి కూడా అచ్చెన్నతో మొహం చాటేస్తున్నారని.. కనీసం పలకరించడం కూడా లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీనియర్లు కూడా చెబుతున్నారు. ``ఇలాంటివి జరగడం కామన్. అన్నీ లైట్‌గా తీసుకోవాలి`` అని విజయవాడకు చెందిన నాయకుడు చెప్పుకొచ్చారు. అయితే.. అటు అచ్చెన్న కానీ, ఇటు లోకేష్ కానీ.. బింకంగానే ఉండడంతో ఈ విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఆ మాటకు వస్తే అచ్చెన్నకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించడం లోకేష్‌కు ఇష్టం లేదు. అందుకే లోకేష్ గ్యాంగ్ బీద రవచంద్రయాదవ్‌ను తెరమీదకు తెచ్చింది. ఇటు అచ్చెన్న కూడా నేరుగా చంద్రబాబుతోనే లోకేష్ నా పనుల్లో వేలు పెట్టకూడదని చెప్పడంతో.. అది తెలిసిన లోకేష్ కూడా అచ్చెన్న విషయంలో ఏమంత సుముఖంగా లేరు.
ఇదిలావుంటే.. తనపై నమోదైన కేసులు.. తన కుటుంబంపై పెడుతున్న కేసుల విషయంలో టీడీపీ సరైన విధంగా స్పందించడం లేదని.. అచ్చెన్న ఆవేదనతో ఉన్నారు. ఇక, ఇతర నేతలు కూడా అచ్చెన్న విషయంలో మౌనంగానే ఉన్నారు. ఆయనతో పెద్దగా టచ్‌లోకి వెళ్లడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌లలో కూడా ఒకరిద్దరు మాత్రమే.. అచ్చెన్నతో క్లోజ్‌గా ఉంటున్నారని.. మిగిలిన వారుఎవరూ కూడా ఆయనను పట్టించుకోవడం లేదని.. సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం నెలకొన్న వివాదం సమసిపోవాలంటే.. చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.