Begin typing your search above and press return to search.
పవన్ వర్సెస్ వైసీపీ.. రగడలో వేలు పెట్టని బాబు.. లోకేష్!
By: Tupaki Desk | 28 Sep 2021 9:35 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వర్సెస్ వైసీపీ ప్రభుత్వానికి మధ్య మాటల మంటలు రేగుతూనే ఉన్నా యి. సాయిధరమ్ తేజ్.. నటించిన రిపబ్లిక్ సినీమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన పవన్.. అనూహ్యంగా దానిని రాజకీయ వేదిక చేశారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడాన్ని తప్పుబ ట్టారు. ఈ క్రమంలోనే మంత్రి పేర్నినానిపై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా.. పేర్ని నాని సహా.. ఇతర మంత్రులు కూడా బారీ ఎత్తున పవన్‌పై విమర్శలు గుప్పించారు.
ఇక, ఆ తర్వాత.. కూడా వైసీపీ వర్సెస్ పవన్ మధ్య రగడ తగ్గకపోగా.. మరింత పెరిగింది. ప్రస్తుతం మీరు కుక్కలు అంటే.. మీరు పందులు అనుకుంటున్నారు. సరే.. ఇదంతా ఒక ఎత్తయితే.. మధ్యలో కాపులను కూడా రంగంలోకి లాగేశారు. అయితే.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం.. పేర్ని నాని వంటివారు.. నా.. కొడ.. అంటూ.. వ్యాఖ్యలు చేయడం.. చిరంజీవికి ఇష్టంలేదని.. జీర్నించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ.. దీనిపై ఆయన ఎక్కడా స్పందించడం లేదు.
మరోవైపు.. తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ విషయంలో వేలు పెట్టేందుకు సాహసించడం లేదు. తమకు.. ఈ విషయానికి సంబంధం లేదని.. పవన్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. మరోవైపు.. ప్రముఖ నిర్మాతలు కూడా ఈ వివాదంలోకి రాలేదు. దీనికి ఏపీ సర్కారుతో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారో..ఏమో.! దీంతో పవన్‌పై వైసీపీ సర్కారు అన్ని కోణాల్లోనూ ఎక్కిదిగుతోంది.
కేవలం రాజకీయ నేతలే కాకుండా.. ఇండస్ట్రీలోని వైసీపీకి అనుకూలంగా ఉన్న వారితోనూ మీడియా మీటింగులు పెట్టి.. పవన్‌పై విమర్శలు గుప్పించేలా చేస్తున్నారు.పవన్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు పోసాని కృష్ణమురళి. అయితే.. ఇంత జరుగుతున్నా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం సైలెంట్ అయింది. వాస్తవానికి ఏ అవకాశం చిక్కినా.. అధికార పార్టీపై విరుచుకుపడే టీడీపీ నేతలు.. ఈ విషయంలో సైలెంట్ కావడం.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సినీ..ఇండస్ట్రీకి ఒక ఉత్సాహభరిత వాతావరణం కనిపించేది. బాబు పాలన ముగిసే సమయానికి ఇదే ఇండస్ట్రీలో ఓ వర్గం.. బాబును టార్గెట్ చేసింది. ఇది టీడీపీని బలహీన పరిచిందనే వాదన ఉంది. అయితే.. ఇప్పుడు మాత్రం బాబు అధికారంలో లేక పోవడం వల్ల తాము ఎంత కోల్పోయామో.. అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చగానే ఉంది. కీలక పెద్దలు కూడా మౌనంగా ఉన్నారంటే.. దీనిని అర్ధం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు కూడా పేర్కొంటున్నారు. బాబు లేని లోటు ఇప్పుడు ఇండస్ట్రీకి తెలిసివచ్చిందని.. ఈ సమయంలో బాబు కానీ, లోకేష్ కానీ జోక్యం చేసుకోకుండా ఉంటేనే బెటరని వారు సూచిస్తున్నారు.