Begin typing your search above and press return to search.
విజన్ @ 2024.. పదివేల కిలోమీటర్స్ నా?
By: Tupaki Desk | 21 Aug 2020 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. కానీ 40శాతం ఓట్లు సంపాదించింది. అదే ఇప్పుడు టీడీపీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. కాబట్టి జూమ్ లో చంద్రబాబు.. ట్విట్టర్ లో లోకేష్ బిజీగా ఉండి ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారు.
అయితే ఈ మధ్య లోకేష్ మరీ నాజూకుగా తయారయ్యాడంట.. సన్నపూసగా మారిపోతున్నాడు. ఒక మాజీ ఎమ్మెల్యే లోకేష్ ను కలిసినప్పుడు ‘స్లిమ్ గా అవుతున్నావ్.. పాదయాత్రకు రెడీనా’ అని లోకేష్ ను ప్రశ్నించగా.. ‘పాదయాత్ర ప్రజలకు బోర్ కొట్టిందని.. సైకిల్ యాత్ర పదివేల కిలోమీటర్లు చేద్దాం అనుకుంటున్నా 2022 జనవరి నుంచి...’ అని లోకేష్ బదులిచ్చాడట.. దానికి ‘‘విజన్ @ 2024’’ పేరు పెట్టి అప్పటివరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులను సెట్ చేసుకుంటానని తెలిపాడట.. ఇప్పుడు ఓటమితో అంతా నైరాశ్యంలో ఉన్నారని.. అప్పటికీ యాక్టివ్ గా ఉండేవారినే తీసుకొని ముందుకెళుతానని లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడట..
లోకేష్ బాబు పాదయాత్రకు బదులు సైకిల్ యాత్రకు రెడీ అవుతున్నారనే ప్రచారం ఇప్పుడు టీడీపీలో జోరుగా సాగుతోంది. ఇంతవరకు పాదయాత్ర చేసిన వారంతా రాజ్యాధికారం సాధించారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ లు సీఎంలు అయ్యారు. మరి సైకిల్ యాత్ర చేస్తున్న చినబాబు అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మనం 2024 వరకు ఆగాల్సిందే..!