Begin typing your search above and press return to search.

నేనూ లోకేష్ టార్గెట్...అల్టిమేట్ అస్త్రాన్ని సంధించిన బాబు

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:31 AM GMT
నేనూ లోకేష్ టార్గెట్...అల్టిమేట్ అస్త్రాన్ని సంధించిన బాబు
X
ప్రజల కోసం పోరాడుతున్న నన్నూ లోకేష్ ని కూడా చంపేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పెదవేగి మండలం విజయరాయిలో చంద్రబాబు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ మీద ఆయన పాలన మీద చేసిన కామెంట్స్ ఒక రేంజిలో సాగాయి. సొంత బాబాయ్ ని చంపినట్లుగానే నన్నూ లోకేష్ బాబునీ చంపాలని వైసీపీ నేతలు చూస్తున్నారు అని బాబు ఆరోపించారు. బాబాయ్ ని గొడ్డలి పోటుతో చంపి గుండె పోటుగా ప్రచారం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.

ఆ కేసు ఏపీ నుంచి తెలంగాణాకు ఎలా తరలిపోయిందో జగన్ నోరు విప్పి చెప్పగలరా అని చంద్రబాబు నిలదీశారు. అప్పట్లో కోడి కత్తి డ్రామాను ఆడారని, రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని ఆయన నిందించారు. ఈ రోజున ఏపీలో పోలీసుల మెడ మీద కత్తి పెట్టి జగన్ పనిచేయిస్తున్నారని అన్నారు. జగన్ కి పోలీసుల బలం ఉంటే తనకు ప్రజా బలం ఉందని బాబు అంటున్నారు.

ఏపీలో ఉన్మాదుల పాలన సాగుతోందని, మరోసారి వారికే అధికారం అప్పచెబితే మాత్రం ఏపీకి మిగిలేది ఏమీ లేదని ఆయన తేల్చేశారు. ఏపీకి అమరావతి, పోలవరం ఈ రెండూ శాశ్వతంగా మరచిపోవాల్సిందే అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి అన్ని అనుమతులు తాను కేంద్రం నుంచి సాధించుకుని వచ్చానని, 72 శాతం పైగా పూర్తి చేశానని, అయినా దాన్ని మూడేళ్ళుగా ఏమీ కట్టలేక జగన్ గోదారి నట్టేట ముంచాడని బాబు మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోల్వరాన్ని ఏమీ కాకుండా చేశారని అన్నారు.

కొత్తగా ఆ జలవనరుళ శాఖకు అమంత్రి అయిన అంబటి రాంబాబుకు డయాఫ్రం వాల్ గురించి కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. అలా చూస్తే ఏపీకి పోలవరం పూర్తి చేయకపోవడం ఒక ఖర్మ అని ఆయన అన్నారు. ఏపీలో అభివృద్ధి లేదని, అవినీతి అక్రమాలు దౌర్జన్యాలే రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని బాబు విమర్శించారు. తనకు చివరి చాన్స్ కాదని, తనకు కొత్తగా చరిత్ర కూడా అవసరం లేదని కానీ రాష్ట్రానికి మాత్రం వచ్చే ఎన్నికలు చివరి చాన్స్ అని చంద్రబాబు చెప్పారు

ఆ ఎన్నికల్లో ఉన్మాదుల నుంచి పాలనను లేకుండా చేఉకుంటేనే మేలు జరుగుతుందని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ బాబు మొదలెట్టిన తొలి స్పీచ్ గోదావరి జిల్లాల్లో సంచలనంగా సాగింది. తనను తన కుటుంబాన్ని వైసీపీ టార్గెట్ చేసింది అంటూ చంద్రబాబు చెప్పిన విషయాలు జనాల్లోకి వెళ్తే మాత్రం ఏపీ రాజకీయం మారుతుంది అనే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.