Begin typing your search above and press return to search.
గ్రేటర్ లో లోకేశ్ తో మమ అనిపిస్తున్నారు
By: Tupaki Desk | 23 Jan 2016 7:31 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ప్రచారాన్ని ముందుండి నడిపించేదెవరన్నది ఇంకా తేలలేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రంగంలోకి దిగుతారని కొందరు నేతలు అంటున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. చంద్రబాబు తనయుడు లోకేశే మొత్తం బాధ్యత చూసుకుంటారని తెలుస్తోంది. ఆయన మాటలు కూడా దాదాపుగా అదే ఖాయం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో తానే ప్రచారం చేస్తానని టీడీపీ యువనేత లోకేష్ తాజాగా మరోసారి ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు ప్రచారం చేయడంపై ఇంకా డెసిషన్ తీసుకోలేదనీ అంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రచారం లేనట్లేనని వినిపిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఎవరెన్ని చెప్పినా విజయం టీఆరెస్ దేనని అన్ని పార్టీలూ దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయి. ఈ సమయంలో గెలుపు దక్కదని తెలిసి కూడా అనవసరంగా కేసీఆర్ దగ్గర చెడ్డ కావడమెందుకని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మేయర్ ఎన్నికకు ముందే అన్ని పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించి ఎక్స్ ఆఫిషియో సభ్యుల బలం పెంచుకున్న టీఆరెస్ ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు కేసీఆర్ తో మెరుగుపడిన సంబంధాలను పాడుచేసుకోవడం తగదని చంద్రబాబు భావిస్తున్నారు. అలా అని పార్టీని పూర్తిగా వదిలేయకుండా లోకేశ్ ను రంగంలోకి దించి మమ అనిపించబోతున్నారు.
అయితే.. లోకేశ్ మాత్రం తాను అంతా ముందుండి నడిపిస్తానని, ఎనిమిది రోజుల్లో అన్ని డివిజిన్లు కవర్ చేస్తానని చెబుతున్నారు. కాబట్టి గ్రేటర్ భారం బాబుది కాదు లోకేశ్ బాబుదేనని తేలిపోయింది.