Begin typing your search above and press return to search.
మళ్లీ వస్తోన్న లండన్ వైద్యులు... ఏమైంది?
By: Tupaki Desk | 13 Oct 2016 4:45 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన చికిత్స అందించేందుకు లండన్ నుంచి వైద్యుల బృందం మళ్లీ చెన్నైకి రానుందని తెలుస్తోంది. కాగా, సెప్టెంబర్ నెలాఖరులో ఒకసారి - ఈనెల 4న మరోసారి లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే చెన్నైకి వచ్చి జయకు చికిత్స చేసి వెళ్లారు. జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే బృందం మళ్లీ చెన్నైకి రానున్నట్లు సమాచారం!
అదేంటి... అమ్మకు బాగానే ఉందనే కదా ఆ లండన్ వైద్యులను తిరిగి పంపేశారు - తాజాగా పనీర్ సెల్వంకు శాఖలు అప్పగించే సందర్భంలో కూడా అమ్మ కోరిక మేరకే, ఆమె అనుమతి తీసుకునే చేసినట్లు చెబుతున్నారు కదా... ఇంతలోనే ఏమైంది అనేది సామాన్యుడి - అమ్మ అభిమాని కొత్త సందేహంగా ఉంది!
కాగా, గత 20 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రోజుకో రకం స్టేట్ మెంట్స్ వస్తున్నాయి. వాటిలో కొన్ని అధికారికంగా వస్తుంటే, మరికొన్ని కొత్త కొత్త సందేహాలు కలిగించేవిగా వస్తున్నాయి. అపోలో వైద్యులు అందించిన లేటెస్ట్ బులెటిన్ లో అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని - వైద్యానికి స్పందిస్తున్నారని అంటూ ఆమెకున్న వ్యాది గురించి తెలిపారు! ఇదే సమయంలో అమ్మకు వైద్యం చేయడానికి లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే కూడా తిరిగి లండన్ వెళ్లిపోవడంతో... అమ్మ కు ఇంక బాగానే ఉండి ఉండొచ్చని అంతా భావించారు. ఇదే క్రమంలో ప్రతిరోజూ ప్రముఖుల పరామర్శలు - జయలలిత త్వరలోనే కోలుకుంటారనే ఆశాభావాల మధ్య జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి లండన్ వైద్యులు చెన్నైకి రానున్నారని కథనాలు వస్తున్నాయి.
అయితే... సీఎం జయలలిత అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వెనుక కొందరు రాజకీయ నేతలున్నారని, ప్రత్యేక పోలీసు బృందం విచారణ జరిపితే వారి పేర్లు కూడా బయటకు వస్తాయని చెబుతున్నారు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/