Begin typing your search above and press return to search.
నగ్నంగా భోంచేసేందుకు ఇంత డిమాండా?
By: Tupaki Desk | 10 Jun 2016 9:19 AM GMTక్రేజీలో ఓ లేటెస్ట్ ఎపిసోడ్ ఇంది లండన్ లో కొత్త హోటల్ వినూత్న పంథాలో వెలసింది. ‘బున్యాదీ’ అన్న హిందీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లండన్‌లో తొలి నగ్న హోటల్ గా ప్రారంభమైంది. బున్యాదీ అంటే పునాది అని అర్థం అంట. ఈ హోటల్ గురించి యజమానులు మరిన్ని వివరాలు వెల్లడిస్తూ..హోటల్ కు వచ్చే వినియోగదారులు పూర్తి సహజత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకే ఈ హోటల్ ను ప్రారంభించినట్లు చెప్పారు.
‘మా హోటల్ కు వచ్చే వినియోగదారులు ఆ రాత్రిని ఎలాంటి భేషజాలు లేకుండా హాయిగా గడపాలన్నదే మా ఉద్దేశం. మా దగ్గర కృత్రిమ రసాయనాలు ఉండవు. కృత్రిమ రంగులు ఉండవు. విద్యుత్తు ఉండదు. గ్యాస్ ఉండదు. ఫోన్ ఉండదు. అలాగే బట్టలు కూడా వినియోగదారులు వద్దనుకుంటే ఉండవు. నిజమైన స్వాతంత్య్రానికి ఈ హోటల్ ప్రతీక’ అని లాలీపాప్ వ్యవస్థాపకుడు సెబ్ లియాల్ అన్నారు. హోటల్ లో నగ్నంగా గడిపేందుకు, క్యాండిల్ లైట్ ఏర్పాట్లకు సహజమైన వెదురు విభాగాలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డామని ఆయన వివరించారు. ఇక్కడ ఆహారాన్ని కూడా మట్టితో తయారు చేసిన పాత్రల్లో అందిస్తారు. వినియోగదారులు తమ ఫోన్లను - ఇతర గాడ్జెట్లను హోటల్ డోర్ బయటే వదిలేసి లోపలికి రావలసి ఉంటుంది. అయితే బట్టలు వేసుకునే ఉండాలనుకునే వారికి ప్రత్యేక సెక్షన్ ను ఏర్పాటు చేశారు. శాకాహార - మాంసాహార పదార్థాలతో పాటు సహజమైన పద్ధతులలో రూపొందిచిన వైన్ ను అందిస్తారు. 42మందికి మాత్రమే ఒక సారి సిటింగ్ కు అవకాశం ఉన్న ఈ హోటల్ లో డిన్నర్ కోసం రాబోయే మూడు నెలల కాలానికి 44,200మంది ముందే బుక్ చేసుకోవటం విశేషం.