Begin typing your search above and press return to search.
బ్రిటన్ లో వర్ణ వివక్ష ఘటన: లండన్ లో మరో జార్జి ప్లాయిడ్
By: Tupaki Desk | 19 July 2020 8:30 AM GMTవర్ణ వివక్ష ఇంకా ప్రపంచంలో తీవ్రంగానే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో వర్ణ వివక్ష ఘటన చోటుచేసుకోవడంతో ఆ దేశంలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో నల్ల జాతీయుడు జార్జి ప్లాయిడ్ పై దాడి చేయడంతో అతడి మృతి చెందిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనలో ప్రపంచంలో మరిన్ని చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్ లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. సేమ్ అమెరికాలో జరిగిన మాదిరి లండన్ లో ఓ నల్ల జాతీయుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆందోళన రేపుతోంది.
లండన్ లోని ఇస్లింగ్ టన్ ప్రాంతంలో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నల్ల జాతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి మెడపై మోకాలితో తొక్కి పట్టారు. వదిలిపెట్టమని అతడు ఎంత వేడుకున్నప్పటికీ పోలీసులు విడిచిపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోందది. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనపై అక్కడి డిప్యూటీ పోలీస్ కమిషనర్ సర్ స్టీవ్ హౌస్ స్పందించి విచారం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక అధికారిని సస్పెండ్ చేశారు. మరో అధికారిని విధుల నుంచి తప్పించారు. అయితే ఈ ఘటనకు కారణం పోలీసులు వివరించారు. ఆ నల్ల జాతీయుడు బహిరంగ ప్రదేశంలో కత్తితో తిరుగుతుండడంతోనే అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.