Begin typing your search above and press return to search.
లండన్ మీద ఉగ్రవాదుల అటాక్..ఆరుగురు మృతి
By: Tupaki Desk | 4 Jun 2017 4:15 AM GMTఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తమ దహనకాండను లండన్ వీధుల్లో మరోసారి ప్రదర్శించారు. మాంఛెస్టర్ లోని సంగీత కచేరిలో జరిపిన బాంబుదాడుల విషాదం నుంచి కోలుకోక ముందే మరో దారుణమైన దాడికి తెగబడి అమాయకుల ప్రాణాలు తీసేశారు. స్వల్ప వ్యవధిలో అగ్రరాజ్యంపై ఉగ్రవాదులు విరుచుకుపడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జాము ప్రాంతంలో బ్రిటన్ రాజధాని లండన్లో బరౌ మార్కెట్ కు చేరువలో బ్రిడ్జ్ పై నడుస్తున్న పాదచారులపై వ్యాన్ దూసుకెళ్లింది. గతంలోనే ఇదే తరహాలో లండన్ లో ఉగ్ర బీభత్సాన్ని సృష్టించారు ముష్కరులు. తాజాగా అదే తీరులో వాహనాన్ని నడిపిన ఉగ్రవాదులు.. అనంతరం ఆయుధాలతో కిందకు దిగి.. కనిపించిన వారిని కనిపించినట్లుగా కత్తులతో పొడిచేసి చంపారు.
ఈ ఉగ్రదాడిలో మొత్తం ఇద్దరు ముష్కరులు పాల్గొన్నట్లుగా సమాచారం. మరోవైపు.. వారి బారిన పడిన ఆరుగురు అమాయకులు మరణించగా.. మరో నలభై మందికి గాయాలైనట్లుగా చెబుతున్నారు. వ్యాన్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి ప్రాణాలు అక్కడికక్కడే పోగా.. కాసేపటికే ఆయుధాలతో బ్రిడ్జి మీదకు వచ్చిన ఉగ్రవాదులు పాదచారులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ఒక బాలికను సుమారు 15 నుంచి 20 సార్ల వరకూ కత్తులతో పొడుస్తూ.. అల్లా కోసమే అంటూ అరిచినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. దాడికి పాల్పడిన వారి కోసం లండన్ పోలీసులు జరిపిన ఆపరేషన్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని కాల్చేసినట్లుగా ప్రకటించారు. మరోవైపు.. దాడికి వేదికగా నిలిచిన లండన్ బ్రిడ్జ్ ను మూసేశారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. బ్రిటన్‌కు సాయం చేస్తామన్న ఆయన.. అందుకే ముస్లింలను దేశంలోకి అనుమతిచ్చే విషయంలో తాను చేసే వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థించుకున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే బ్రిటన్ లో ఉగ్రవాదులు విరుచుకుపడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/