Begin typing your search above and press return to search.
ఇక, ఇంటికే ఆక్సీజన్ సిలిండర్!
By: Tupaki Desk | 6 May 2021 3:30 PM GMTఢిల్లీలో కొవిడ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. కొత్తవారికి బెడ్ దొరికే ఛాన్సే లేకుండాపోయింది. దీంతో.. ఇళ్లలో ఉండలేక.. దవాఖానాల్లో చోటు లేక ఎంతోమంది అభాగ్యులు విలవిల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రోగులకు ఇంటికే ఆక్సీజన్ సిలిండర్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఆక్సీజన్ ను ఢిల్లీకి తెప్పిస్తున్నాయి. ఢిల్లీలో ఆక్సీజన్ ప్లాంట్లు లేకపోవడంతో.. బయటి నుంచే తెప్పిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది.
అయితే.. ఈ ఆక్సీజన్ సిలిండర్ పొందడానికి ఓ ప్రొసీజర్ రూపొందించింది. దీని ప్రకారం.. ఎవరికైతే సిలిండర్ అవసరమో.. వారు ముందుగా వెబ్ సైట్లో బాధితుల పేరు, అడ్రస్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్లో ఆధార్ కార్డుతోపాటు కరోనా పాజిటివ్ రిపోర్టును కూడా జత చేయాల్సి ఉంటుంది.
ఆక్సీజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం వల్ల ఆసుపత్రులపై చాలా భారం తగ్గుతుందని భావిస్తోంది.. ఆక్సీజన్ ఇంట్లోనే తీసుకుంటూ.. వైద్యుల సలహాలు పాటిస్తే.. ఇబ్బందులు తగ్గుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం.