Begin typing your search above and press return to search.

ఈనెల 27తో భూమి అంతం.?

By:  Tupaki Desk   |   25 July 2018 11:27 AM GMT
ఈనెల 27తో భూమి అంతం.?
X

ఈ శతాబ్ధంలోనే అతి పొడవైన చంద్రగ్రహణానికి వేళైంది. ఈ నెల 27న శుక్రవారం ఆకాశంలో ఎరుపు రంగులోని చంద్రుడు( బ్లడ్ మూన్) కనువిందు చేయనున్నాడు. సూర్యుడు - చంద్రుడు - భూమి ఒకే కక్ష్యలోకి రావడం వల్ల ఈ బ్లడ్ మూన్ ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై నుంచి పడి కొన్ని మాత్రమే చంద్రుడిని చేరుతాయి. దీంతో ఆ చీకటిలో చంద్రుడు తన సహజకాంతిని కోల్పోతాడు. భూమిపైనున్న వారికి చంద్రుడు ఎరుపురంగులో కనిపిస్తాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం కూడా మనకు ఆకాశంలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అంగారకుడు - చంద్రుడు కనిపిస్తాడని చెబుతున్నారు.

అయితే ఈ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడడానికి ఆసక్తి చూపుతుంటే కొందరు మాత్రం ఈ నెల 27తో మానవుని మనుగడకు ఆఖరి రోజని.. భూమి అంతం కాబోతోందని ప్రచారం మొదలు పెట్టారు. బ్లడ్ మూన్ తో పాటు అంగారక గ్రహం కూడా కనిపిస్తే విపత్కర పరిస్థితులు తలెత్తి భూమి అంతమైపోతుందని పూర్వీకులు చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ప్రళయం సంభవించడం ఖాయమంటున్నారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు మాత్రం కొట్టిపారేస్తున్నారు.