Begin typing your search above and press return to search.
రవిప్రకాశ్..శివాజీ..మూర్తిలకు లుక్ అవుట్ నోటీసులు!
By: Tupaki Desk | 18 May 2019 10:29 AM GMTమోసం.. అక్రమంగా నిధుల మళ్లింపు.. ఫోర్జరీలకుపాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు.. అక్రమంగా టీవీ9తో పాటు మరో ఐదు లోగోల్ని అమ్మిన వైనంపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. మాజీ సీవోవో మూర్తితో పాటు సినీ నటుడు శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.
శుక్రవారం అర్థరాత్రి వేళ సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేస్తారు. ఈ ముగ్గురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు తాజా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఎందుకింత తీవ్ర నిర్ణయాన్ని పోలీసులు తీసుకున్నారన్నది చూస్తే.. వివిధ ఆరోపణల నేపథ్యంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ రవిప్రకాశ్.. శివాజీలు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. నోటీసులు జారీ చేసిన నాటి నుంచి బయటకు రావటం లేదు. వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. తాజా అస్త్రంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరైన మాజీ సీవోవో మూర్తి పలు విషయాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారంతో ఫోర్జరీ పత్రాల్ని ఎలా రూపొందించారన్న విషయంపై స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా నోటీసుల నేపథ్యంలో అయినా పోలీసుల విచారణకు వస్తారా? లేక.. పోలీసులే అరెస్ట్ చేసే వరకూ విషయాన్ని సాగదీస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.