Begin typing your search above and press return to search.

కోర్టులో కేసు వేసిన హ‌నుమంతుడు

By:  Tupaki Desk   |   10 April 2017 4:24 AM GMT
కోర్టులో కేసు వేసిన హ‌నుమంతుడు
X
ఆ మ‌ధ్య‌న విడుద‌లైన గోపాల‌.. గోపాల సినిమా గుర్తుందా? సామాన్యుడు వేసిన కేసుతో స‌ర్వాంత‌ర్యామి అయిన శ్రీకృష్ణుడు భూలోకానికి రావ‌టం తెలిసిందే. నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అన్న విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. ఆ సినిమా కాన్సెప్ట్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ త‌ర‌హాలోనే ఒక ఉదంతం చోటు చేసుకుంది. కాకుంటే.. ఆ సినిమాలో మాదిరి సామాన్యుడు కాకుండా.. ఏకంగా భ‌వంతుడే కోర్టుకెక్క‌టం ఈ ఉదంతం ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి.

కంటికి క‌నిపించ‌ని అంజ‌నీపుత్రుడు హ‌నుమంతుడు పిటీష‌న్ వేయ‌టం ఏమిట‌న్న‌ది ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. అధికారుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ను రేపుతున్న ఈ ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. భ‌గ‌వంతుడే కోర్టులో వేసిన ఈ కేసును.. ఆయ‌న త‌ర‌ఫున దేవేంద్ర భార్గ‌వ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

ఎందుకిలాంటి ప‌రిస్థితి చోటు చేసుకున్న‌ద‌న్న‌ది చూస్తే.. ఒక క్వారీని మూసివేయించాల‌ని.. గ‌ని తవ్వ‌కాల్లో భాగంగా బాంబుపేలుళ్ల కార‌ణంగా ఆ ప్రాంతంలోని పురాత‌న ఆల‌యం దెబ్బ తింటోంద‌ని..అందులోని హ‌నుమంతుడి మందిరం బీట‌లు వారుతోంద‌ని పేర్కొన్నారు. అందుకే.. ఆ గ‌నిని మూసివేయ‌టంతో పాటు.. న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాలంటూ కోరారు.

గ్రీన్ ట్రైబ్యున‌ల్‌ కు అందిన ఈ పిటీష‌న్ ఆస‌క్తిక‌రంగా మార‌టంతో పాటు.. అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేవుడి పేరు మీద అందిన ఈ పిటీష‌న్‌.. "అంజ‌నీపుత్రుడునైన నేను హ‌న్ మాన్ ను. నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ కు విన్న‌వించుకునేది ఏమ‌న‌గా.." అంటూ కొన‌సాగింది. మ‌రీ పిటీష‌న్ పై గ్రీన్ ట్రైబ్యున‌ల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/