Begin typing your search above and press return to search.
రాముడు పాకిస్తాన్ లో పుట్టాడు
By: Tupaki Desk | 5 Nov 2015 8:59 AM GMTహిందువులు భగవానుడుగా భావించే రాముడు పుట్టింది అయోధ్యలో కాదా? అసలాయన పుట్టింది త్రేతా యుగంలోనే కాదా? కాదనే తాజాగా వెలువడ్డ ఒక పుస్తకం చెబుతోంది. 'ఫ్యాక్ట్స్ ఆఫ్ అయోధ్య ఎపిసోడ్ - మిథ్ ఆఫ్ రామ్ జన్మభూమి (అయోధ్య ఉదంతం వాస్తవాలు - రామ జన్మభూమి భ్రమ)' అనే పేరున్న ఈ పుస్తకాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్ బి) సభ్యుడు అబ్దుల్ రహీం ఖురేషీ రాశారు.
ఈ బోర్డుకు సహాయ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న ఖురేషీ రామజన్మభూమి వివాదం బ్రిటిష్ కాలం నాటి అవశేషమని అన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో ఎఐఎంపిఎస్‌బి కక్షిదారుగా ఉండటం గమనార్హం. రాముడు గంగా మైదానంలో జన్మించినట్టు వేదాల్లో గానీ, పురాణాల్లో గానీ ఎక్కడా పేర్కొన లేదని ఖురేషీ వాదిస్తున్నారు.
రాముడి తండ్రి దశరథ మహారాజు పాలించిన సప్తసింధు ప్రాంతం నిజానికి హర్యానా, పంజాబ్‌ల నుంచి పాకిస్తాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్ తూర్పు కొస దాకా వ్యాపించిన ప్రాంతమని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని రహ్మాన్ ధేరీ అనే పట్టణం రాముడి అసలు జన్మస్థలమని భారత పురాతత్వ సర్వే సంస్థ (ఎఎస్‌ఐ) పూర్వ అధికారి జస్సూ రామ్ వెల్లడి చేశారని ఆయ న ఉటంకించారు. ఇప్పుడు రహ్మాన్ ధేరీ అని పిలుస్తున్న పట్టణాన్ని గతంలో రామ్ ధేరీ అని పిలిచే వారని ఖురేషీ చెబుతు న్నారు. 'బాబర్ రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ మసీదు కట్టారనే కట్టుకథను బ్రిటిష్ వాళ్లు హిందువులకు, ముస్లిం లకు మధ్య విద్వేషం రగల్చడానికే పుట్టించారు. అది బాబర్ స్వభావానికే విరుద్ధం. ఆయన తన కుమారుడు హుమాయున్‌కు మత పక్షపాతాన్ని రద్దు చేయాలన్నారు* అని ఈ సందర్భంగా వివరించారు.
రామజన్మభూమిని కైవసం చేసుకోవాలని లోలోపల ఎంత కసి ఉన్నా హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ రేంజ్‌లో బురదజల్లాల్సిన అవసరం ఏముందని పలువురు మండిపడుతున్నారు.