Begin typing your search above and press return to search.
రైలును లారీ ఢీ.. ఎమ్మెల్యే సహా 6మృతి
By: Tupaki Desk | 24 Aug 2015 4:10 AM GMTఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర లెవల్ క్రాసింగ్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను గ్రానైట్ లారీ ఒకటి ఢీ కొంది. అదుపు తప్పిన లారీ.. రైలు బోగీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాయి ఒక బోగీ మీద పడింది. దీంతో సదరు బోగీ పూర్తిగా దెబ్బ తింటే.. మరోరెండు బోగీలు పక్కకు ఒరిగాయి.
గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్ధంతో.. పెద్ద కుదుపునకు లో నైన రైలుతో ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. రైలు ప్రయాణికులు ఐదుగురు.. లారీలోకి ఒకరు మరణించినట్లుగా చెబుతున్నారు. మరణించిన రైలు ప్రయాణికుల్లో కర్ణాటకలోని దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్ మరణించారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష నేత జగన్ లు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో బెంగళూరు..గుంతకల్లు మార్గంలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ ఘోర ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు.
ప్రమాదానికి గురైన రైల్లోని ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక.. ప్రమాదానికి గురైన రైలు బోగీలను తొలగించటంతో పాటు.. లైన్ క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబరు; 97013 74062
ధర్మవరం హెల్ప్ లైన్ నెంబర్; 08559 222555