Begin typing your search above and press return to search.
తెలంగాణకు ‘బిగ్’ లాస్... రూ.7,500 కోట్లు
By: Tupaki Desk | 16 Dec 2016 6:49 AM GMTపెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రానికి రూ. 7500 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల మేరకు రాష్ట్ర ఆదాయానికి గండిపడనుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ఆదాయ రాబడికి రూ. 3000 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
శాసనసభ శీతాకాల సమావేశాల తొలి రోజు శుక్రవారం సభలో నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయానికి కలిగిన నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. నోట్ల రద్దు వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ - రవాణాశాఖ - అమ్మకం పన్నులు - వాణిజ్యపన్నులు - ఎక్సైజుశాఖకు ప్రధానంగా నష్టం వాటిల్లడంతోపాటు పరోక్షంగా కేంద్ర పన్నులపై రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా తగ్గనుందని అంచనా వేశారు. నోట్ల రద్దువల్ల రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో పూర్తిగా కుదేలైందని, దీనివల్ల 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయింది.
ఇదీ అంచనా..
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రోజుకు రూ.23 కోట్ల చొప్పున నెలకు రూ.100 కోట్లు వచ్చే మార్చి నాటికి రూ. 400 కోట్ల నష్టం వాటిల్లుతుంది.
- ఎక్సైజు శాఖకు నెలకు రూ.50 కోట్ల చొప్పున వచ్చే మార్చి నాటికి రూ.250 కోట్లు
- వాణిజ్య పన్నుల శాఖకు నెలకు రూ. 420 కోట్ల నుంచి 450 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలలలో రూ. 1800 కోట్ల
- రవాణాశాఖకు నెలకు రూ. 90 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలల్లో రూ. 450 కోట్లు
- పరోక్షంగా కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటా నెలకు రూ. 400 కోట్ల చొప్పున ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1600 కోట్లు తగ్గనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/