Begin typing your search above and press return to search.
ఓడిపోయిన తండ్రీ, కొడుకులు
By: Tupaki Desk | 11 March 2022 5:30 AM GMTపంజాబ్ ఎన్నికల్లో ఒక విచిత్రం జరిగింది. శిరోమణి అకాలీదళ్ పార్టీ తరపున పోటీచేసిన తండ్రి, కొడుకులిద్దరు తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోవటమే విచిత్రం అనుకుంటే ఇద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధుల చేతిలోనే ఓడిపోవటం మరీ విడ్డూరం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పంజాబ్ లో అకాలీదళ్+బీఎస్పీ కూటమిగా పోటీచేసిన విషయం తెలిసిందే.
అకాలీదళ్ తరపున ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాష్ సింగ్ బాదల్ లంబి నియోజకవర్గంలో పోటీచేశారు. ఆప్ అభ్యర్ధి గుర్మీత్ సింగ్ కుడియాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
అలాడే జలాలాబాద్ నుండి పోటీచేసిన బాదల్ కొడుకు సుఖ్ బీర్ సింగ్ కూడా ఓడిపోయారు. సుఖ్ బీర్ సింగ్ ఆప్ అభ్యర్ధి జగదీప్ కాంబోజ్ ఓడిపోయారు. ప్రకాష్ సింగ్ బాదల్ కు ఇవే చివరి ఎన్నికలను చెప్పవచ్చు.
చివరి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం నిజంగా బాధాకరమే. ఎందుకంటే బాదల్ వయసు ఇపుడు 94 సంవత్సరాలు. దేశం మొత్తంమీద ఇంత వయసులో పోటీచేసిన నేత మరొకళ్ళలేరు.
ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసుండటం, సిఖ్ఖుల్లో మంచి పట్టుడటం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవటం కారణాలుగా బాదల్ గెలుపు ఖాయమనే అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందలైపోయి ఘోరంగా ఓడిపోయారు.
మొత్తంమీద అసలు ఇంతవయసులో బాదల్ పోటీ చేయటమే ఓ రికార్డు. అందులోను తండ్రి, కొడుకులు ఇద్దరు ఓడిపోటం పైగా ఒకే పార్టీ అభ్యర్ధుల చేతిలో ఓటమి విచిత్రమనే చెప్పాలి. నిజానికి ఇద్దరికీ తమ నియోజకవర్గాల్లో గట్టి పట్టేఉంది. అయినా వ్యతిరేక గాలి కొడుతున్నట్లు ఎవరు మాత్రం ఏమి చేయగలరు ?