Begin typing your search above and press return to search.

ప‌తాంజ‌లి బ్రాండ్ దిమ్మ‌తిరిగే ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   11 Jan 2018 2:17 PM GMT
ప‌తాంజ‌లి బ్రాండ్ దిమ్మ‌తిరిగే ప్ర‌క‌ట‌న‌
X

స్వదేశీ బ్రాండ్‌ పేరుతో అనతి కాలంలోనే వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న పతంజలి....విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు వెల్‌కం చెప్తోంది. త‌న‌దైన శైలిలో ఈ కంపెనీ గ్లోబల్ లెవల్లో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ లూయిస్ విటన్ లేదా ఎల్‌ వీఎంహెచ్.. పతంజలి ఆయుర్వేదలో 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3250 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌ కే గుప్తా తిజరావాలా ఈ విషయాన్ని ట్విట్టర్‌ లో వెల్లడించారు.

తెలంగాణతోపాటు నాగపూర్ - గ్రేటర్ నోయిడా - అస్సాం - చత్తీస్‌ గడ్ - ఆంధ్రప్రదేశ్ - హర్యానాల్లో ఔషధ - సుగంధ మొక్కల పెంపకానికి పది వేల ఎకరాల స్థలం అవసరం ఉందని, దీనికోసం రూ.5 వేల కోట్లు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆచార్య బాలకృష్ణ గతంలో చెప్పారు. ఇందుకు సంబంధించిన పెట్టుబ‌డులకు ఆస‌క్తి చూప‌గా విదేశాల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ విష‌యాన్ని తాజాగా ట్విట్ట‌ర్‌ లో వెల్ల‌డించారు. అయితే విదేశీ టెక్నాలజీని వాడుకుంటున్నట్లే మన దేశ లబ్ధి కోసం విదేశీ నిధులు వాడుకోవడానికి కూడా తాము ఏమాత్రం వెనుకాడబోమని సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ అన్నట్లు తిజరావాలా చెప్పారు. అయితే పెట్టుబడులకు ఓకేగానీ.. అందుకు ప్రతిగా కంపెనీలో వాటాలు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

కాగా, మేడిన్ ఇండియా ట్యాగ్‌తో మార్కెట్‌ లో సంచనాలు సృష్టిస్తున్న పతంజలి.. ఎఫ్‌ ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగంలో 2019లో యూనిలీవర్‌ ను మించడంతోపాటు - 2020లో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించబోతున్నదని యోగా గురు రాందేవ్ బాబా అంచనా వేశారు. త్వరలోనే పతంజలి నుంచి జీన్స్ - ట్రౌజర్స్ - కుర్తాస్ - షర్ట్స్ - సూటింగ్స్ - స్పోర్ట్స్‌ వేర్ వస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.