Begin typing your search above and press return to search.

ఆ వయసు తేడా.. ప్రేమికుల ప్రాణాలు తీసింది

By:  Tupaki Desk   |   23 Dec 2020 9:31 AM GMT
ఆ వయసు తేడా.. ప్రేమికుల ప్రాణాలు తీసింది
X
అక్కడ అమ్మాయి వయసు 21, అబ్బాయి వయసు 15 ఏళ్లు మాత్రమే.. అయినా వీరి మధ్యన ప్రేమ పుట్టింది.. పండింది.. పరిగెత్తింది. అయితే సభ్యసమాజం మీద వారికి డౌటొచ్చింది. తమ ప్రేమకు వయసు అడ్డంకి అనుకొని భ్రమపడి నిండు ప్రాణాలు తీసుకునేలా చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం అందరిని కలిచి వేస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లాలోని గార్ల మండలానికి చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఇద్దరికీ కొన్నాళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వయసులో వ్యత్యాసం ఉండడంతో వీళ్లు తమ ప్రేమ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పలేదు. కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. ఇలాంటి విషయాలు కూడా ఎన్నో రోజులు దాగవు కదా. సోమవారం ఇరు కుటుంబాలకూ తెలిసింది. దీంతో ఈ ప్రేమ జంట భయపడి అదే రోజు తమ ఇళ్ల నుంచి పారిపోయింది. వీరిద్దరి కోసం వెతుకుతున్న క్రమంలో ఊరు శివార్లలోని వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.

వయసు తేడా వల్ల తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమో అనే భయంతోనే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ గుడ్డిదంటారు. దానికి ధైర్యం, మనో నిబ్బరం అవసరం.. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారు. కానీ ఓ మైనర్‌ ప్రేమ ఇలా విషాదాంతంగా ముగిసింది.