Begin typing your search above and press return to search.
లవ్ హైదరాబాద్ బొమ్మను లేపేశారు
By: Tupaki Desk | 18 Nov 2017 4:03 AM GMTహైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ అంటే గత ఏడాది వరకు గుర్తుకొచ్చేది బుద్ధ విగ్రహం. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంటే బుద్ధ విగ్రహం సరసన భారీ జాతీయ పతాకం కూడా స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ముంబైలో సముద్రతీరంలో కన్పించే లవ్ ముంబై మాదిరిగా అక్షరాలతో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ శిల్పం దర్శనమిచ్చింది. గత ఏడాది లవ్ హైదరాబాద్ సింబల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లవ్ హైదరాబాద్ ను లేపేశారు.
చుట్టూ ఆకుపచ్చహారం.. ఎత్తయిన బుద్దుడు - బుద్ధుని విగ్రహాన్ని మించి అతి పెద్ద జాతీయ పతాకం..వీటన్నింటినీ కవర్ చేస్తూ లవ్ హైదరాబాద్ వెరసి హుస్సేన్ సాగర్ తీరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద సెల్పీలతో సందడి వాతావరణం నెలకొంటున్నది. ఐతే ప్రధాన రద్ధీగా ఉండే ట్యాంక్ బండ్ ఈ సింబల్ ఉండడం - ఇక్కడ రోడ్లపైకి వచ్చి సెల్పీలతో సందడి చేస్తుండడం - సందర్శకులు తమ తమ వాహనాలను ప్రధాన రోడ్డుపైనే నిలిపి వేయడంతో అటు ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ అందాలన్నీ కనిపించే చోటకు ఈ లవ్ హైదరాబాద్ సింబల్ తరలించాలని మంత్రి కేటీఆర్ హెచ్ ఎండీఏ అధికారులను ఆదేశించారు. దీంతో ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఫీపుల్ ప్లాజా వద్దకు ఈ లవ్ హైదరాబాద్ సింబల్ ను హెచ్ ఎండీఏ అధికారులు శుక్రవారం తరలించారు. ఈ వేదిక ద్వారా అటు ప్రయాణీకులకు - ఇటు పర్యాటకులకు ఈ లవ్ హైదరాబాద్ కనువిందు చేయనుందని అధికారులు చెబుతున్నారు.
ట్యాంక్ బండ్ పై ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి ఎదురుగా ‘లవ్’ అనే హిందీ భాషలోని భారీ పదాలు ఎరుపురంగులో, దానికి పక్కనే ‘HYD’(హైదరాబాద్) అనే ఆంగ్లపదాలకు సంబంధించిన అందమైన భారీ అక్షరాలు తెలుపురంగులో దీన్ని తీర్చిదిద్దారు. హిందీ - ఆంగ్ల పదాలకు వేర్వేరుగా వేసిన రంగులు మరింత ఆకర్షణీయంగా కన్పించాయి. సుమారు 8.3అడుగుల ఎత్తు - అయిదు అడుగుల వెడల్పుతో ఒక్కో అక్షరాన్ని ఏర్పాటు చేశారు. నగరానికి వచ్చే పర్యాటకులు - నగరవాసులు ఈ అందమైన లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద సెల్ఫీలు తీసుకుని మధురానుభూతుల్ని పొందేలా దీన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఈ చిహ్నం స్థానం మారటాన్ని గమనించాలని హెచ్ ఎండీఏ వర్గాలు చెప్తున్నాయి.