Begin typing your search above and press return to search.
లవ్ జిహాద్...ఈ దఫా షాక్
By: Tupaki Desk | 10 Nov 2015 4:28 PM GMTఘర్ వాపసీ...లవ్ జిహాద్....బీఫ్. ముందువచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములే వాడి అన్నట్లుగా ఆలస్యంగా తెరమీదకు వచ్చిన బీఫ్...లవ్ జీహాద్ ను తొక్కేసింది. హిందుత్వవాదుల కోణంలో లవ్ జీహాద్ అంటే....హిందు యువతులను ముస్లిం యువకులు వివాహం చేసుకోవడం ఆ తర్వాత వారిని ముస్లిం మతంలోకి మార్చడం. దీనికి కౌంటర్ గా గతంలో పలు హిందూ సంస్థలు ముస్లిం మతం పుచ్చుకున్న పలువురిని తిరిగి హిందువులుగా మార్చి దానికి ఘర్ వాపసీగా పేరుపెట్టారు. అయితే తాజాగా మరోమారు లవ్ జీహాద్ తెరమీదకు వచ్చింది.
ఇంతకీ ఆ ఆసక్తికరమైన అప్ డేట్ ఏంటంటే.... న్యూఢిల్లీ జామా మసీదును దేశంలో ప్రముఖమైనదిగా ముస్లింలు భావిస్తుంటారు. ఆ మసీదు ఇమాం సయ్యద్ బుఖారీ కుమారుడు సుభాన్ బుఖారీ ఓ హిందూ యువతిని వివాహమాడారు. సయ్యద్ బుఖారీ కుమారుడు సుభాన్ ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన హిందూ మహిళను వివాహం చేసుకున్నారని దైనిక్ జాగరణ్ పత్రిక పేర్కొంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, వారి సన్నిహిత బంధువులు మాత్రమే హాజరయ్యారని, అందుకే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది.
ఇదిలాఉండగా...బీఫ్ పేరుతో జరుగుతున్న రచ్చపై ఆర్ ఎస్ ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ ఫైరయింది. గోమాంసం తింటామని పట్టుబడుతున్న వారు హిందువులను అవమానించేందుకు స్వేచ్ఛ కావాలని కోరుతున్నారని ఆర్గనైజర్ పేర్కొంది. ఆర్గనైజర్ ఈ రోజు ప్రచురించిన ఒక వ్యాసంలో కేరళ హౌస్ బీఫ్ వివాదంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛ పేరుతో ఏం తినాలన్న స్వేచ్ఛ ఉందని పేర్కొంటూ... అలా చేస్తున్నవారు హిందువులను అవమానించేందుకు స్వేచ్ఛ కోరుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ అంశం వారి ప్రాథమిక హక్కుల అంశం కాదనీ, హిందువులను అవమానించేందుకు హక్కుగా మారిందని విమర్శించింది. వీరికి సూడో సెక్యులరిస్టులు గొంతు కలిపారని ఆర్గనైజర్ ఆ వ్యాసంలో విమర్శించింది.
మొత్తంగా కొద్దికాలం క్రితం వరకు స్తబ్ధుగా ఉన్న లవ్ జీహాద్...తాజాగా సద్దుమణిగిన బీఫ్ గొడవ మళ్లీ ఈ రూపంలో తెరమీదకు రావడం ఆసక్తికరమే.