Begin typing your search above and press return to search.
ఇద్దరు అమ్మాయిల లవ్.. మ్యారేజ్.. ఒకమ్మాయి ఆత్మహత్యాయత్నం..!
By: Tupaki Desk | 11 Nov 2022 4:02 AM GMTలవ్.. మ్యారేజ్.. ఇది మనకు కొత్తకాదు. ప్రేమించుకునే వారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.. ఇరు కుటుంబాలను ఒప్పించి చేసుకుంటారు. ఇది యువతి, యువకుడి విషయంలో జరిగేదే. అయితే.. ఇద్దరు యువతులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్తితి వచ్చేశారు. దీంతో పెళ్లి బంధంతో ఒక్కటై కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్.. ఒక అమ్మాయి ఇంట్లో పెద్దలు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. ఛీ.. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటి.. పెళ్లేంటి? అని నివ్వెర పోయారు.
కట్ చేస్తే.. ఈ ఇద్దరు అమ్మాయిలు.. కాదు కాదు .. లవర్స్.. ఇంటి నుంచి జంప్ చేసేశారు. తర్వాత ఏం జరిగిందంటే.. తమిళనా డు ధర్మపురిలో ఓ వినూత్న ప్రేమ జంట దర్శనమిచ్చింది. ఇద్దరు అమ్మాయిల మనసులు కలిసి.. వారి మధ్య ప్రేమ చిగురించిం ది. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమికులు. ఒక్కటిగా కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ తెరమీదికి వచ్చింది.
ఎర్కోల్‌పట్టికి చెందిన శివప్రకాశ్ తన కుమార్తె సబిల(21), నంగవల్లి ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేసిన ధరణ్యకు మధ్య స్నేహం కుదిరింది. తర్వాత కాలంలో ఇది లవ్..గా మారింది. . కోయంబత్తూరులోని ఓ కాలేజీలో చదువుతున్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసి సబిల కుటుంబ సభ్యులు ఆమెను గత రెండు నెలలుగా కాలేజీకి పంపలేదు. అయితే అక్టోబరు 30 వ తేదీన ధరణ్యను చూసేందుకు సబిల కోయంబత్తూరుకు వెళ్లింది.
అనంతరం.. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి జంప్ చేశారు. ఈ నేపథ్యంలో సబిల తండ్రి తన కుమార్తె కనిపించడం లేదని పెన్నాగారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సబిల.. కోయంబత్తూరులో ఉన్న ఆమె స్నేహితురాలు ధరణ్య(22)ను కలిసేందుకు వెళ్లిందని పోలీసులకు తెలిసింది. పోలీసులు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇచ్చారు.
అయితే ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని.. కలిసే జీవిస్తామని యువతులు పోలీసులకు తెలిపారు. కానీ, ధరణ్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. యాగీ చేవారు. దీంతో మనస్తాపానికి గురైన ధరణ్య.. పోలీస్ స్టేషన్లోని టాయిలెట్లోకి వెళ్లి బ్లేడుతో కుడి చేయి, మెడపై కోసుకుంది.తీవ్ర రక్త స్రావమైన పరిస్థితిలో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు హుటాహుటిన ధరణ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స నిమిత్తం ధర్మపురి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా తామిద్దరం పెళ్లి చేసుకుంటామని.. ఒప్పుకోక పోతే చచ్చిపోతానని ధరణ్య చెప్పడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.