Begin typing your search above and press return to search.

ప్రేమ , పెళ్లి .. మనస్తాపంతో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

By:  Tupaki Desk   |   19 March 2021 8:30 AM GMT
ప్రేమ , పెళ్లి .. మనస్తాపంతో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
X
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు వాలంటీర్లు ఆత్మహత్య కి పాల్పడగా , తాజాగా మరో వాలంటీర్ ఆత్మహత్య కి పాల్పడ్డాడు . ప్రేమ కారణంగా వాలంటీర్ ఆత్మహత్య కి పాల్పడ్డాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే హ్యాపీ కదా మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే , ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఆ పెళ్లి ఇష్టం లేక ఆ యువతిని ఇంటికి తీసుకువెళ్లారు. దీనితో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ప్రేమించిన అమ్మాయి మరెవరో కాదు .. అదే సచ్చివాలయంలో పనిచేసే మహిళా పోలీస్.

వివరాల్లోకి వెళ్తే .. ఈ మద్య కాలంలో ఆత్మహత్య లు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించడం వల్ల కొందరు , పెళ్లితో మరికొందరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో నిండు నూరేళ్లు గడపాల్సిన వారు మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట వాలంటీర్ యాజలి నాగేంద్ర బాబు ఆత్మహత్య కి పాల్పడ్డాడు. కొత్తపేట పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు అదే సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వర్తించే అమ్మాయిని ప్రేమించాడు. ఆ తర్వాత అమ్మాయి కి ఇష్టం ఉండటంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. అయితే , ఆ అమ్మాయి వాలంటీర్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ యువతిని తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడుకోవడానికి వీలుపడలేదు. ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయాననే భాద , పెళ్లిని ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య కి పాల్పడ్డాడు.