Begin typing your search above and press return to search.
మ్యాచ్ జరుగుతుంటే .. ఆసీస్ యువతికి లవ్ ప్రపోజల్ భారత యువకుడు !
By: Tupaki Desk | 30 Nov 2020 2:30 AM GMTప్రేమ కథలో అమ్మాయి అబ్బాయితోనో, అబ్బాయి అమ్మాయితోనో ప్రపోజ్ చేసే సన్నివేశం ఒకటి ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఉంటుంది. మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడానికి యువత ఎన్నో వినూత్న మార్గా లని, సమయాన్ని ఎంచుకుంటారు. ఇండియా, ఆసీస్ మధ్య నేడు జరిగిన రెండో వన్డేలో ఇదే జరిగింది. తనకు నచ్చిన అమ్మాయికి ఓ యువకుడు ప్రపోజ్ చేస్తుంటే తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గ్రౌండ్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇండియాకు చెందిన ఓ యువకుడు, తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియన్ యువతికి స్టేడియంలోనే లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ దృశ్యాలను కెమెరామెన్ కెమెరాలో బంధించాడు. ఇండియన్ యువకుడు ప్రపోజ్ చేసిన విధానానికి షాక్ అయిన ఆ ఆస్ట్రేలియన్ యువతి, అతని ప్రేమను అంగీకరించింది. అతన్ని హగ్ చేసుకొని ,ఎంతో ప్రేమగా ముద్దాడింది.
దీనితో మైదానం మొత్తం ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. ఈ వీడియో స్క్రీన్లలో కనిపించడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా చప్పట్లతో అభినందనలు తెలిపాడు. అలాగే కామెంటేటర్లు ఆ జంట కి కంగ్రాట్స్ చెప్పారు.
ఇకపోతే , సిడ్నీలో ఇవాళ జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు పరాజయం పాలైంది. మూడు వన్డేల సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా 51 పరుగుల తేడాడో ఓడింది. అన్ని రంగాల్లో భారత్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసింది.