Begin typing your search above and press return to search.
కొత్త సంవత్సరంలో గజగజ వణకాల్సిందేనట
By: Tupaki Desk | 27 Dec 2019 4:29 AM GMTవేసవిలో ఎండ మండటం.. వానాకాలంలో వర్షాలు కురవటం మామూలే. చలికాలంలో చలితో గజగజలాడటం అలవాటే. కానీ.. మరో ఐదారు రోజుల్లో వచ్చే కొత్త సంవత్సరం తొలి నాళ్లలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలపైన దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది మరింత ఎక్కువన్న మాట వినిపిస్తోంది.
జనవరిలో తెలంగాణలో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మరింత పడిపోవటం ఖాయమంటున్నారు. ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న తేమ గాలుల కారణంగా ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు. నల్గొండ.. మెదక్ లలో అతి తక్కువగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. హైదరాబాద్ లో 15 నుంచి 21డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇప్పుడున్న చలిగాలులు తక్కువేనని.. జవనరిలో గజగజలాడే చలి ఖాయమని.. తొలి వారం నుంచే చలిపులి చెలరేగిపోనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే స్వెట్టర్లు తీసి ఉంటే ఓకే.. లేదంటే దుమ్ము దులిపి.. ఉతికి రెఢీ చేసుకోండి.. మరో వారంలో వాటి అవసరం మరింత ఎక్కువ కానుంది.