Begin typing your search above and press return to search.
సెలెబ్రెటీల రాజకీయం.. హిట్.? ఫ్లాప్?
By: Tupaki Desk | 14 May 2019 2:30 PM GMTరాజకీయాలు - సినిమాలు రెండింటిని వేరుగా చూడలేం.. తమిళనాట అయితే సినీ ప్రముఖులే రాజ్యమేలారు. ఎంజీఆర్ - జయలలిత ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు కమల్ - రజినీ రంగంలో ఉన్నారు.
సినీ నటుల ప్రభావం దక్షిణాదినే కాదు.. ఉత్తరాదిన కూడా ఉంది. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది సినీ ప్రముఖులు పోటీచేశారు. సన్నీ డియోల్ - ఉర్మిలా - ప్రకాష్ రాజ్ - హాన్స్ రాజ్ సహా చాలా మంది బరిలో నిలిచారు. కొందరు ప్రజల చేత ఎన్నుకోబడి.. కొందరు పార్టీలు రాజ్యసభకు నామినేట్ చేస్తే ఎంపీలుగా చలామణీ అవుతున్నారు.
అయితే సినీ ప్రముఖులు దేశ పార్లమెంట్ లో అంత చురుగ్గా పాల్గొంటారా.? సమస్యలపై స్పందించి ప్రశ్నిస్తారా? 2014 ఎన్నికల అనంతరం ఏర్పడ్డ లోక్ సభలో సినీ రాజకీయ ప్రముఖల ప్రభావం ఎంతనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
లోక్ సభలో ఎంపీల సరాసరి హాజరు శాతం 80గా ఉంది. కానీ గత పార్లమెంట్ కు ఎన్నికైన సినీ సెలెబ్రెటీల హాజరు 66శాతం మాత్రమే ఉంది. ఇక బీజేపీ ఎంపీ హేమామాలిని 39శాతం మాత్రమే హాజరు ఉంది. అతి తక్కువ హాజరు కలిగి ఉన్న వారిలో ఈమె రెండోవారు.
*బెంగాల్ నటుడు - తృణమూల్ ఎంపీ దీప్ దేవ్ అతితక్కువగా 11శాతం మాత్రమే హాజరు ఉంది. ఈయనే అతి తక్కువ హాజరున్న సినీ రాజకీయ నేత
*పార్లమెంట్ చర్చల్లో పాల్గొన్న ఎంపీల సరాసరి 67శాతం ఉండగా.. సెలెబ్రెటీల హాజరు శాతం 22 మాత్రమే..
*మొత్తం ఎంపీలు 293 ప్రశ్నలు అడిగితే సెలెబ్రెటీలు 101 ప్రశ్నలే అడిగారు.
*కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా ఏ చర్చలో పాల్గొనలేదు.. ఒక్క ప్రశ్న అడగకపోవడం విశేషం.
*రాజకీయ నటుల్లో అత్యధిక హాజరు శాతం బీజేపీ ఎంపీ - బెంగాలీ నటుడు జార్జి బేకర్ (98శాతం)కు ఉంది.
*తెలుగు సినిమా నటుడు - టీడీపీ ఎంపీ మురళీ మోహన్ హాజరు శాతం 88గా ఉంది.
*పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడంలో సినీ ప్రముఖులు బీజేపీ ఎంపీ కిరణ్ కేర్ ముందున్నారు. ఆమె 335 ప్రశ్నలు అడిగారు. సభ్యుల సరాసరి 293 కంటే ఇది ఎక్కువ.
* కిరణ్ కేర్ తర్వాత మురళీ మోహన్ 267 ప్రశ్నలు అడిగారు.
*నిధుల వెచ్చింపులో సినీ రాజకీయ సెలెబ్రెటీలే బెస్ట్
హాజరు - ప్రశ్నలు అడగడంలో బద్దకిస్తులైన సినీ సెలెబ్రెటీలు నిధులు వినియోగించడంలో మాత్రం రాజకీయ నేతలకన్నా
ముందున్నారు. తమ ఎంపీ ల్యాండ్స్ నుంచి 87.9 శాతం వినియోగించారు. రాజకీయ నేతలు 82.9మాత్రమే వినియోగించారు. కేంద్రం ప్రతీ ఎంపీకి ఐదేళ్లకు రూ.5కోట్ల నిధులు ఇస్తుంది. ఇందులో సెలబ్రెటీ అయిన సంధ్యారాయ్ 98.8శాతం నిధులను వినియోగించింది. హేమమాలిని వినియోగంలో వెనుకబడ్డారు. శతృఘ్న సిన్హా 91.1శాతం వినియోగించారు.