Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హ‌త్య: సీబీఐ చెప్పిన‌ట్టు కోర్టు వింటుందా?

By:  Tupaki Desk   |   25 July 2022 9:03 AM GMT
వైఎస్ వివేకా హ‌త్య: సీబీఐ చెప్పిన‌ట్టు కోర్టు వింటుందా?
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సంచ‌ల‌న ప‌రిణామం చోటు చేసుకుంది. ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయటకు వస్తే సాక్షులకు ఇబ్బంది ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సీబీఐ పిటిషన్‌పై త్వరలో సుప్రీంలో విచారణ జరుగనుంది.

కాగా వివేకా మ‌ర్డ‌ర్ కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డికి గతంలో సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ మొదట ఏపీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.

అయితే సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఏం నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది కీల‌కంగా మారింది.

కాగా గ‌తంలో గంగిరెడ్డిని బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ప్పుడు సీబీఐ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉంటే.. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని.. సీబీఐ తరఫు న్యాయవాది.. కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి.. సరైన సాక్ష్యాలు లేవని.., హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో సీబీఐ.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

కాగా వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే.. అతడికి సంబంధించిన విషయాలను సీబీఐ బయటపెట్టింది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు కుట్ర జరిగిందని సీబీఐ పేర్కొంది.

అయితే హత్య చేయడానికి నెల రోజుల ముందుగానే.. నిందితులు షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను ఇంటికి పిలిపించి.. మరీ.. హత్యకు పథక రచన చేశారని తెలిపింది. వివేకాను చంపేస్తే.. రూ.40 కోట్ల రూపాయలను శివశంకర్ రెడ్డి ఇస్తారంటూ.. ముగ్గురికీ ఎర్ర గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. హత్యలో కీలకపాత్ర అతడిదేనని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.