Begin typing your search above and press return to search.
కొత్త వియ్యంకులు.. నేతలకు ట్రూజెట్ టెన్షన్
By: Tupaki Desk | 2 Nov 2015 6:22 AM GMTకొత్త వియ్యంకులు కంగారు పడ్డారు. ధూంధాంగా పెళ్లి వేడుకలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే సందడిలో సరదాగా గడిపి.. ఆ ముచ్చట్లతో తిరిగి వెళుతున్న వారు కాసింత కంగారు పడే ఘటన చోటు చేసుకుంది. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు.. నారాయణలు వియ్యంకులు కావటం తెలిసిందే. ఈ వివాహం నెల్లూరులో భారీగా జరిగిన సంగతి తెలిసిందే. గంటా కుమారుడికి.. నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం.. ఆ పెళ్లి వేడుకలు నెల్లూరులో పూర్తి అయిన తర్వాత తిరుగు ప్రయాణం విశాఖకు వెళ్లేందుకు పెళ్లి వారితో పాటు.. పలువురు ఎమ్మెల్యేలు.. ముఖ్యులకు ట్రూజెట్ కు చెందిన విమానాన్ని ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారు.
వారంతా సదరు విమానంలో తిరుగుముఖం పట్టారు. విశాఖలో ల్యాండ్ అయ్యే సమయానికి అనుమతి రాకపోవటంతో.. విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టే పరిస్థితి. దాదాపు గంటపాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన నేపథ్యంలో విమానంలోని మంత్రి గంటా మొదలు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాసింత కంగారు పడినట్లు తెలిసింది.
విశాఖలో ఆకాశం మేఘావృతం కావటం.. ల్యాండ్ కావటానికి అనుమతి రాకపోవటంతో ఆకాశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తానికి గంటపాటు టెన్షన్ అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించటంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. చేతిలో ఎంత అధికారం ఉన్నా.. ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతి సహకరించాల్సిందే సుమా.