Begin typing your search above and press return to search.
షాట్ కొడితే.. కాసేపు మ్యాచే ఆపేశారు
By: Tupaki Desk | 10 July 2017 7:58 AM GMTఒక బ్యాట్స్ మెంట్ భారీ షాట్ కొడితే.. అయితే ఫోర్.. లేదంటే సిక్స్. కానీ.. అందుకు భిన్నంగా కాసేపు మ్యాచ్ ఆగిపోవటం అన్నది ఉండదు. కానీ.. తాజా ఉదంతంలో అలాంటిదే జరిగింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఒక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన భారీ షాట్‌కు ఏకంగా అరగంట పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఇంతకీ ఎందుకిలా జరిగింది? అన్నది చూస్తే..
ఇంగ్లాండ్ లో నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్ టోర్నీ ఒకటి జరుగోతంది. టోర్నీలో భాగంగా నాటింగ్ హామ్ షైర్ - బర్మింగ్ హామ్ మధ్య జరిగిన మ్యాచ్ లో నాటింగ్ హామ్ షైర్ 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బర్మింగ్ హామ్ బ్యాటింగ్ కు దిగింది. నాలుగో ఓవర్ వేసేందుకు నాటింగ్ హామ్ బౌలర్ బంతిని అందుకున్నాడు. అతను వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న సామ్ హైన్స్ బంతిని బలంగా కొట్టాడు.
అయితే.. ఆ బంతి నేరుగా బౌలర్‌నే బలంగా తలను తాకింది. దీంతో బంతి వేసిన ఫ్లెచర్ విలవిలలాడిపోయాడు. వెంటనే అతడి వద్దకు చేరుకున్న సహచర ఆటగాళ్లు.. అంపైర్లు దెబ్బ తీవ్రతను చూసి వెంటనే చికిత్స కోసం సాయం అర్థించారు.
అంబులెన్స్ లో క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఊహించనిరీతిలో చోటు చేసుకున్న పరిణామంతో మిగిలిన ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు. దీంతో.. అంపైర్లు మ్యాచ్ ను 30 నిమిషాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా గాయానికి గురైన ఫ్లెచర్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్న వేళలో.. తాను కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.