Begin typing your search above and press return to search.
అప్పటివరకు మూకదాడులు ఆగవు:ఆరెస్సెస్
By: Tupaki Desk | 24 July 2018 10:25 AM GMTదేశంలో మూకదాడులు వల్ల ఎంతో మంది అమాయకులు అశువులు బాస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, నానాటికీ పెరిగిపోతున్న మూకదాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా మూకోన్మాద ఘటనలు - దాడులను అడ్డుకునేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దానికోసం రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఓ పక్క కేంద్రం ...మూకోన్మాదంపై ఉక్కుపాదం మోసేందుకు చర్యలు చేపడుతోంటే...మరోపక్క ఆ దాడుల గురించి (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులను చంపడం (గోవధ) ఆపేసినపుడే...మూకదాడులూ ఆగిపోతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ లోని అల్వార్ లో అన్వర్ అనే వ్యక్తి మూకదాడిలో చనిపోయిన ఘటనపై ఇంద్రేష్ ఈ విధంగా స్పందించారు. ఎవరిపై అయినా దాడులు చేయడం అనేది హేయమైన చర్య అని, అయితే, ఆవులను చంపాలని ఏ మతం చెప్పదని అన్నారు.
క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారని - యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణమని అన్నారు. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో గోవధను నిషేధించి..దానిని పాటించినపుడే మూకదాడులు - హత్యాకాండ - వంటివి జరగవని ఇంద్రేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు - స్వామి అగ్నివేష్ పై జరిగిన దాడిని ఇంద్రేష్ ఖండించారు. కాగా, మూక హత్యలను నివారించేందుకు కేంద్రం 2 కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సుష్మాస్వరాజ్ - రవిశంకర్ ప్రసాద్ - నితిన్ గడ్కరీ - టీసీ గెహ్లాట్ సభ్యులుగా జీఓఎంను ఏర్పాటు చేశారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నలుగురు సభ్యులతో ఉన్న అధికారుల కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ప్రస్తుతం భారత శిక్షా స్మృతిలో ఉన్న నిబంధనలను అధ్యయనం చేసి, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త నిబంధనలను మంత్రుల సంఘానికి 15 రోజుల్లోగా సిఫారసు చేస్తారు. మంత్రుల కమిటీ తన నివేదికను ప్రధానికి సమర్పిస్తుంది.