Begin typing your search above and press return to search.

తిరుప‌తి ఉప పోరులో ఓటేసింది వీరే.. మిగిలిన వాళ్లు సైలెంట్‌!

By:  Tupaki Desk   |   17 April 2021 9:00 AM GMT
తిరుప‌తి ఉప పోరులో ఓటేసింది వీరే.. మిగిలిన వాళ్లు సైలెంట్‌!
X
తిరుపతి ఉప ఎన్నికలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేశారు. సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కాదలూ రులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక‌, వైసీపీ అభ్యర్థి డాక్టర్ మ‌ద్దెల‌ గురుమూర్తి కూడా త‌న కుటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చి ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తిలోని మన్న సముద్రంలో ఓటర్లతో పాటు క్యూ లైన్‌లో నిల్చుని గురుమూర్తి ఓటేశారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం గురుమూర్తి దంపతులు ఓటు వేశారు. ఇక‌, టీడీపీ అభ్య‌ర్థి, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి కూడా నెల్లూరు జిల్లా వెంకన్న పాలెంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లతో కలిసి క్యూలో నిల్చుని పనబాక ఓటేశారు.

అయితే.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు కూడా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, సీనియ‌ర్లు.. పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చినా.. టీడీపీలో మాత్రం మాజీ ప్ర‌తినిధులు ఎవ‌రూ కూడా రాలేదు. తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ మాత్ర‌మే త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారు ఎవ‌రూ కూడా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తుంద‌ని అనుకున్నా.. ఎక్క‌డా కూడా ఆ ఛాయ‌లు క‌నిపించ‌లేదు. చాలా వ‌ర‌కు పోలింగ్ కేంద్రాలు జ‌నాలు లేక ఖాళీగా క‌నిపించాయి. మొత్తంగా చూస్తే.. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు కేవ‌లం 20 శాతానికి కూడా పోలింగ్ శాతం చేరువ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.