Begin typing your search above and press return to search.
మాచర్లలో రాజకీయం ఆరాచకానికి పరాకాష్ఠనట
By: Tupaki Desk | 18 Dec 2022 5:30 AM GMTరాజకీయ అన్న తర్వాత అందరూ ఒకే ఒక్కరి చుట్టూనే ఉండరు. ఎవరి మైండ్ సెట్ కు తగ్గట్లు.. వారి అభిరుచులకు.. అభిప్రాయాలకు తగ్గట్లుగా తాము అభిమానించే.. ఆరాధించే పార్టీల వైపు నిలుస్తారు. వ్యక్తిగతంగా ఉండే ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటప్పుడు ఎవరికి వారు వారు మద్దతు ఇచ్చే పార్టీ ఉన్నట్లే.. వారు వ్యతిరేకించే పార్టీ ఉంటుంది. ఈ వ్యతిరేకత అన్నది ఏ స్థాయి వరకు ఉండాలన్న విచక్షణ చాలా ముఖ్యం. పరిమితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎండవు. కానీ.. లైన్ దాటేస్తేనే అసలు కష్టమంతా.
ఏపీలో రాజకీయం ఇప్పుడు లైన్ దాటేసిందనే చెప్పాలి. జగన్ సర్కారు కొలువు తీరిన కొంతకాలానికే రాజకీయం రూపురేఖలు మొత్తం మారిపోవటమే కాదు.. ప్రత్యర్థులు అనే వారు బలంగా ఉండకూడదన్నట్లుగా పరిస్థితుల్లో వచ్చేశాయి. అది అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో అంచనాలకు అందని రీతిలో ఆరాచకం తాండవిస్తోంది అలాంటి ఆరాచకాలకు నిదర్శనంగా మాచర్ల నియోజకవర్గం నిలుస్తోందన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇటీవల మాచర్లలో చోటు చేసుకున్న పరిణామాలు చూశాక.. రాజకీయ హింస మరీ ఇంత దారుణంగానా? అన్నట్లుగా మారింది. ఇలాంటి వేళ.. అసలు మాచర్లలో గడిచిన మూడున్నరేళ్లుగా ఏం జరిగింది? జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాజకీయ అధిపత్య పోరు మరో స్థాయికి వెళ్లింది. మాచర్లలో గడిచిన మూడేళ్లలో చోటు చేసుకున్న పరిణామాల గురించి మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. ప్రధాన మీడియాలోనూ స్థానిక వార్తల్లోనే వీటిని ఉంచేయటం ద్వారా పెద్దగా బయటకు రాలేదు. పెద్దగా చర్చ జరగలేదు. దీంతో ఆరాచకం అంతకంతకూ ఎక్కువ అయిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో తీవ్ర హింసకు కారణం కానుందన్న మాట వినిపిస్తోంది.
గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న పలు రాజకీయ హింసాత్మక ఘటనల్ని పక్కన పెడితే.. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న రెండు ఉదంతాలు చాలు.. అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైపోతుందని చెబుతారు. 2022 జనవరిలో గుండ్ల పాడుకు చెందిన టీడీపీ నేత చంద్రయ్యను ఆయన రాజకీయ ప్రత్యర్థులు నడిరోడ్డు మీద గొంతు కోసి చంపేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివరామయ్య మరికొందరు కొన్నిరోజులు జైల్లో ఉండి వచ్చేశారు. దీంతో.. ఆ గ్రామంలో టీడీపీకి మద్దతుగా నిలిచే పలు కుటుంబాల వారు ఊరు వదిలిపెట్టేసి వెళ్లిపోవటం గమనార్హం.
ఇక.. ఇదే ఏడాది జూన్ లో దుర్గి మండలంలో టీడీపీ నేత జల్లయ్యను గ్రామానికే చెందిన వైసీపీ నేత హత్య చేశారు. ప్రాణాలు తీసే హత్యల లెక్క ఇలా ఉంటే. దాడులు.. బెదిరింపుల ఉదంతాలు బోలెడన్ని ఉంటాయని చెబుతారు. ఎన్నికలు వస్తే నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థి వర్గీయుల్ని అడ్డుకునే దరిద్రపు గొట్టు సంప్రదాయం అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. డిమాండ్ చేయటం.. కాదంటే వారనింగ్ ఇచ్చేయటం లాంటివి పెరుగుతున్నాయి. ఇక.. ప్రత్యర్థి నేతలు.. వారి ఫాలోయర్స్ మీద తప్పుడు కేసులు పెట్టించటం.. వారి ఆస్తుల్ని కారుచౌకగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా చూసినప్పుడు మాచర్ల అన్నది రాజకీయ ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పరిస్థితి.