Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రిపోర్ట్: 'మచిలీ పట్నం'.. ఎవరి పరం..
By: Tupaki Desk | 6 April 2019 10:25 AM GMTఅసెంబ్లీ నియోజకవర్గం: మచిలీపట్నం
వైసీపీ: పేర్ని వెంకట్రామయ్య(నాని)
టీడీపీ: కొల్లు రవీంద్ర
జనసేన: బండి రామకృష్ణ
ఏపీలోని కృష్ణ జిల్లా గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా మారింది. జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలు గెలుచుకుంది. ఆ తరువాత ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడంతో 13 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఈసారి ఎన్నికల్లో మాత్రం వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా రకరకాల స్కెచ్ లు వేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీపై బలమైన సామాజిక వర్గం కొంత వ్యతిరేకతతో ఉంది. బలహీన సామాజిక వర్గాలంతా ఒక్కటై అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించనున్నాయ. ఈ తరుణంలో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర - వైసీపీ నుంచి పేర్ని వెంకట్రామయ్య - జనసేన నుంచి బండి రామకృష్ణ బరిలో ఉన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గం చరిత్ర:
ఓటర్లు: లక్షా 60 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు - టీడీపీ 6 సార్లు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పేర్ని నానిపై విజయం సాధించారు.
* పేర్ని వెంకట్రామయ్య(నాని) మూడోసారి గెలుస్తాడా..?
2004 - 2009లో పేర్ని వెంకట్రామయ్య కాంగ్రెస్ తరుపున వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఆ తరువాత 2014లో వైసీపీ తరుపున పోటీచేసి కొల్లు రవీంద్రపై 15వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతోనే ఆయన ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో నాని తప్పకుండా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నానికి జనసేన అభ్యర్థి నుంచి ఎదురుదెబ్బ తప్పేట్లు లేదు. ఎందుకంటే ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న బండి రామకృష్ణ ఇదే సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఓట్లు చీలే అవకాశమున్నాయని అంటున్నారు.
*అనుకూలతలు:
-టీడీపీపై వస్తున్న వ్యతిరేకత
-సొంత ఇమేజ్ ఉండడం
-కాపు సామాజికవర్గం బలంగా ఉండడం
* ప్రతికూలతలు:
-వైసీపీ కేడర్ బలంగా లేకపోవడం
-టీడీపీకి కంచుకోట కావడం
*కొల్లు రవీంద్ర మరోసారి నెగ్గేనా..?
2014 ఎన్నికల్లో 15వేల మెజారిటీతో టీడీపీ నుంచి నిలబడి గెలుపొందిన కొల్లు రవీంద్ర మంత్రి వర్గంలో కూడా పనిచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. బందరు పోర్టు నిర్మాణ పనులు - మచిలీపట్నం అథారిటీ డెవలప్ మెంట్ పనులు చేయడంలో కొల్లు రవీంద్ర చొరవ చూపారు. ఇక జనసేన - వైసీపీ నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఓట్లు చీలుతాయి. ఆ పరిస్థితి రవీంద్రకు కలిసొచ్చే అవకాశం ఉంది.
* అనుకూలతలు:
-సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం - మంత్రి వర్గంలో పనిచేయడం
-అభివృద్ధి పనులు
-టీడీపీ కేడర్ బలంగా ఉండడం
* ప్రతికూలతలు:
-ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత
-కులాల వారీగా ఓట్లు చీలడం
*టఫ్ ఫైట్ లో గెలుపు ప్రతిష్టాత్మకం..
ఇక జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ సైతం ఈసారి తనదే గెలుపు అన్నట్లుగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం కీలకంగా ఉంది. కాపు ఓట్ల పైనే ఆధారపడి ఆ సామాజికవర్గానికే చెందిన వైసీపీ - జనసేనలు నువ్వా నేనా అన్నట్లు పోరు సాగిస్తున్నాయి.. మరోవైపు టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులు - సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపిస్తాయా..? అన్నది చూడాలి.