Begin typing your search above and press return to search.

కోటి రూపాయలతో మోడీ మైనపు బొమ్మ

By:  Tupaki Desk   |   23 Sep 2017 9:26 AM GMT
కోటి రూపాయలతో మోడీ మైనపు బొమ్మ
X
లండన్లోని మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఇండియన్ సెలబ్రెటీల మైనపు విగ్రహాలు పెడితే చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. భారత్ నుంచి అనేకమంది రాజకీయ.. సినీ ప్రముఖులకు ఆ మ్యూజియంలో చోటు దక్కింది. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్ లోని టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐతే మన ప్రముఖుల మైనపు విగ్రహాల్ని చూసేందుకు ఇకపై విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. డుస్సాడ్ మ్యూజియం వాళ్లు ఢిల్లీలోనే తమ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ దిశగా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో మేడం టుస్సాడ్ మ్యూజియం భారతీయ విభాగాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ కోటి రూపాయల ఖర్చుతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైనపు విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. డిసెంబరులో ఈ మ్యూజియం లాంచ్ అవుతుందని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోడీతో పాు మరో 49 మంది భారతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలు పెడతామని చెప్పారు. ఎక్కువగా ఫ్రీ డం ఫైటర్లు - బాలీవుడ్ సెలబ్రిటీల విగ్రహాలు ఉంటాయన్నారు. వాటి దగ్గర సందర్శకులు సెల్ఫీలు తీసుకోవచ్చు కూడా. ఈ మ్యూజియం టికెట్లను పెద్దవారికి 800 నుంచి 900 రూపాయల వరకు నిర్ణయించామన్నారు. లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో దాదాపు 300 మైనపు విగ్రహాలున్నాయి.