Begin typing your search above and press return to search.
మదనపల్లె జంట హత్యల కేసు ..ఆ ఇద్దరికి బెయిల్ !
By: Tupaki Desk | 27 April 2021 2:39 PM GMTఏపీలో సంచలనంరేపిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులకి బెయిల్ మంజూరు అయ్యింది. మదనపల్లె జంట హత్య కేసులో జైల్లో ఉన్న పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులకి మదనపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. మూఢనమ్మకాలతో బంగారం లాంటి ఇద్దరు కూతుర్లని హత్య చేసిన ఘటనలో కొన్ని రోజుల నుండి ఈ దంపతులిద్దరూ కూడా జైళ్లో శిక్ష ను అనుభవిస్తున్నారు.
పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులను జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ దెబ్బకు జైల్లో ఖైదీలు వణికిపోయారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు.
పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించగా.. మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్ చేశారు. నిందితులు పురుషోత్తం, పద్మజలను విశాఖ తరలించారు.. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఆ తర్వాత వారిద్దరూ కొలువువడంతో మదనపల్లి పోలీసులు తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.