Begin typing your search above and press return to search.
చంద్రబాబు పై తిరుగబాటు ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
By: Tupaki Desk | 2 Jan 2020 11:08 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుపై ఇటీవలే తిరుగుబాటు చేసి జగన్ కు జైకొట్టిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబుకు గురువారం బహిరంగ లేఖ రాసి సంచలన ఆరోపణలు చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ ను కలిసి స్థానిక సమస్యలు తెలిపానని.. సీఎం వెంటనే స్పందించి రూ.25కోట్ల నిధులు విడుదల చేశారని మద్దాలి గిరి లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ ను కలిసినందుకు తనను నియోజకవర్గ ఇన్ చార్జిగా తొలగించి వేరే వ్యక్తిని పెట్టడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు.
ఇక టీడీపీకి తిరుగుబాటు చేసిన వల్లభనేని వంశీ నియోజక వర్గం లో ఇంతవరకూ టీడీపీ ఇన్ చార్జి ని ఎందుకు నియమించలేదని మద్దాలి గిరి ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గంలో ఎందుకు ఇన్ చార్జిని నియమించలేదని లేఖలో కోరారు.
గుంటూరులో 17 నియోజకవర్గాలుంటే 9 సీట్లు చంద్రబాబు ఒక సామాజికవర్గానికే కేటాయించారని మద్దాలిగిరి మండి పడ్డారు. విశాఖలో వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.